Asianet News TeluguAsianet News Telugu

అరుదైన రికార్డు సాధించిన శ్రీశైలం పాజెక్ట్‌

ఒకే సంవత్సరంలో శ్రీశైలం డ్యామ్ ఆరు సార్లు క్రస్ట్ గేట్లను ఎత్తడం ఒక రికార్డు .ఎప్పుడు లేని విధంగా శ్రీశైలం జలాశయం నిర్మించిన నుండి ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో ఆరు సార్లు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవు. అలాంటిది గత కొన్ని నెలలుగా  కురుస్తున్న వర్షానికి ఆరు సార్లు  క్రెస్ట్ గేట్లను ఎత్తాల్సి వచ్చింది.  
 

Srisailam crest gates opened again
Author
Srisailam, First Published Oct 13, 2019, 11:11 AM IST

ఈ ఏడాది కురుసిన వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాలోని చాలా పాజెక్ట్‌లకు జలకళ  వచ్చింది. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో  ప్రధాన డ్యాంలైనా నాగుర్జునసాగర్,శ్రీశైలం, శ్రీరాంసాగర్  నిండు కుండల మారాయి. కృష్ణా నది ఉధృతికి చాలా ఏళ్ళ తర్వాత  శ్రీశైలం పాజెక్ట్ పూర్తిగా  నిండిపోయింది. దీంతో పాజెక్ట్  గెట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా శ్రీశైలం డ్యామ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.  

ఒకే సంవత్సరంలో శ్రీశైలం డ్యామ్ ఆరు సార్లు క్రస్ట్ గేట్లను ఎత్తడం ఒక రికార్డు ఎప్పుడు లేని విధంగా శ్రీశైలం జలాశయం నిర్మించిన నుండి ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో ఆరు సార్లు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవు. అలాంటిది గత కొన్ని నెలలుగా  కురుస్తున్న వర్షానికి ఆరు సార్లు  క్రెస్ట్ గేట్లను ఎత్తాల్సి వచ్చింది.  

అక్టోబర్ మాసంలో కురిసిన వర్షాలకు కృష్ణా నది సొయగంతో నల్లమల అడవులు మధ్య ప్రవహిస్తుంటే  కొండలు పచ్చ పట్టు చీర కట్టుకుని  అతి సుందరంగా కనబడుతున్నాయి. రెండు కొండల మధ్య ఉన్న శ్రీశైలం ఆనకట్ట నుండి  గేట్ల ద్వార విడుదలతున్న నీటితో నది పరివాహక ప్రాంతాలు  ఎంతో సుందరంగా కనబడుతున్నాయి. ఎగువ పరివాహక ప్రాంతాలలో వర్షాలు భారీగా కురియడంతో పైనున్న జలాశయాలు నిండుకుండల మారాయి. దీంతో  ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరిగింది. 

ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు కూడా వరద ప్రవహం ఉధృతంగా రావడంతో డ్యాం పూర్తిగా నిండిపోయింది.  దీంతో ఇ ట్రస్ట్ గేట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి అనంతరం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ వరద నీటి ప్రవాహంతో  శ్రీశైలం డ్యామ్ పూర్తి స్ధాయిలో నిండి పోయింది. 


దీంతో అధికారులు డ్యాం గరిష్ట స్థాయి నీటిమట్టం 885 చేరుకోగానే మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం చరిత్రలోనే ఒకే సంవత్సరంలో ఆరు సార్లు డామ్ గేట్లను ఎత్తి దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా  6వ సార్లు జలాశయం నుండి 3 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తివేసి 84,225 క్యూసెక్కుల వరదనీటిని కిందకు విడుదల చేశారు అధికారులు .   ప్రస్తుతం పాజెక్ట్‌కు  ఇన్ ఫ్లో: 1,17,627 క్యూసెక్కులు. ఉండగా ఔట్ ఫ్లో 68,342 క్యూసెక్కులు.గా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios