మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా మండల సమాఖ్య ( NFIW. ) మహిళల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డోన్‌లో మౌన దీక్ష ర్యాలీ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేపట్టాలని, మరియు అత్యాచారాలను, హత్యలు, దాడులను అరికట్టాలంటూ జాతిపితకు వినతిపత్రం అందజేశారు.

స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్నారని, మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలపై దేశంలో ప్రతి గంటకు ఎక్కడో ఒక చోట అత్యాచారానికి గురవుతూనే ఉన్నారని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా మండల సమాఖ్య సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సుగుణమ్మ పాల్గొన్నారు. 

సంబంధిత వీడియో

మహిళా సంఘాల మౌన ర్యాలీ (వీడియో)...