వైద్య అధికారిపై సచివాలయ మహిళా ఉద్యోగుల భర్తలు తిరగబడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... శుక్రవారం ఉదయం 10గంటలకు మహిళలు ఏఎన్ఎం కౌన్సిలింగ్ కి వచ్చారు.  కౌన్సిలింగ్ మధ్యాహ్నం 3గంటలకు అయిపోయిన తర్వాత కూడా రాత్రి 8గంటల 30 నిమిషాల వరకు ఆర్డర్ కాపీ ఇవ్వకపోవడం గమనార్హం.

తాము ఉదయం 10గంటల నుంచి  పిల్లలతో కలిసి ఎదురు చూస్తున్నామని సాయంత్రం అయినా అధికారులు కౌన్సిలింగ్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఆర్డర్ కాపీ ఇవ్వలేదని జిల్లా అధికారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు.

ఉదయం నుంచి ఎదురుచూస్తుంటే... రాత్రి ఎప్పుడో వచ్చి సంతకాలు పెడుతున్నారని సచివాలయ ఉద్యోగుల భర్తలు మండిపడ్డారు.