కర్నూల్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం మహాక్షేత్రంలో ఏడు రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. 

శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు తమ సిబ్బందితో శ్రీశైలం మహా క్షేత్రాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో వివిధ పూలతో క్షేత్రాన్ని అలంకరింపజేసి భక్తులకు భక్తి భావాన్ని పెంపొందించే విధంగా వివిధ కళా రూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. 

 ఇందులో భాగంగా మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు.ఈ బ్రహ్మోత్సవ అ కళ్యాణానికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెంచు భక్తులను  ఆహ్వానించారు. 

శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ అధికారుల సహకారంతో చెంచు భక్తులు బ్రహ్మోత్సవ కళ్యాణోత్సనాన్ని వీక్షించేవిధంగా ప్రత్యేకంగా చెంచులకు ప్రాధాన్యత కల్పిస్తూ మొట్టమొదటిసారిగా ఏర్పాట్లను చేస్తున్నారు.

Also read: వైఎస్ జగన్ పై ఫైట్: బిజెపి నేతలతో పవన్ కల్యాణ్ భేటీపై ఉత్కంఠ

 కర్నూలు ప్రకాశం గుంటూరు జిల్లాలోని సుమారు 150 చెంచు గూడాల నుండి భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు శ్రీశైల మహా క్షేత్రాని కి రానున్నారు.శ్రీశైలం మహాక్షేత్రంలో చెంచు భక్తుల సంస్కృతి సాంప్రదాయాలలో సంక్రాంతి కళ్యాణోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

Also Read: 16న భేటీ: బీజేపీతో కలిసి జగన్ పై పోరుకు పవన్ కల్యాణ్ వ్యూహరచన

 ప్రసిద్ధమైన జానపద కథ ప్రకారంగా ఒకసారి  అమ్మవారు భూలోకానికి వచ్చినపుడు చెంచులు అమ్మవారిని తమ కన్న బిడ్డగా భావించి ఆదరిచించడంతో అమ్మ వారిని వెతుక్కుంటూ స్వామి వారు కూడా భూలోకానికి రావడం జరిగిందని పురాణగాథలు చెబుతున్నాయి.

Also Read: జగన్ మీద ఫైట్: బిజెపి అస్త్రం పవన్ కల్యాణ్, చంద్రబాబు వెనక్కి

అమ్మవారు చెంచు గూడెంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న స్వామి వారు చెంచు యువకుడు వేషంలో గూడానికి చేరుకున్నారని అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ వివాహం అయితే అమ్మవారు తమను వదిలి వెళ్లిపోతారని భావనతో చెంచు పెద్దలు వివాహానికి అంగీకరించలేదు.

 దీంతో పెద్దల ప్రమేయం లేకుండానే స్వామి వారు అమ్మవారిని సంక్రాంతి రోజున వివాహం చేసుకున్నారని అందుకే వారి సంప్రదాయంలో సంక్రాంతి నాటి వివాహాన్ని స్వామివారి దొంగ పెళ్లి అని భావిస్తారని వారు ప్రగాఢంగా నమ్ముతారు.

Also read:జనసేన, బీజేపీ నేతల భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై నేడు కీలక ప్రకటన

 అయితే  విషయం తెలుసుకున్న చెంచు పెద్దలు  అందరి సమక్షంలో తిరిగి  మహాశివరాత్రి రోజు మరోసారి స్వామి అమ్మవార్లకు వివాహాన్ని జరిపించారు.  అదే అసలు పెళ్లిగా  నిలబడిందని భ్రమరాంబ దేవి తమ కూతురుగా  శ్రీ మల్లికార్జున స్వామి వారు అల్లునిగా భావిస్తారు.

Also read:నాలుగేళ్ల ప్లాన్: పవన్‌తో చర్చలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్వామివారిని చెంచు మల్లన్న గా  అమ్మవారిని చెంచు మల్లమ్మ  గా ఆప్యాయంగా పిలుచుకుంటారు. అందుకే చెంచులకు సంక్రాంతి రోజున శ్రీశైలమహాక్షేత్రంలో ప్రాధాన్యత పెంచే దిశలో కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ప్రత్యేక చర్యలు చేపట్టారు.