తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకోసం శుక్రవారం అర్థరాత్రినుండి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆర్టీసిలోని అన్ని విభాగాల కార్మికులు నిరసన బాట పట్టారు. కేవలం తమ విధులను బహిష్కరించచడమే కాకుండా తమతమ బస్ డిపోల వద్ద ధర్నా చేపట్టాలని ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. 

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిసి ఉద్యోగులు డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా జగిత్యాల జిల్లాలో కూడా ఆర్టిసి సిబ్బంది విధులను బహిష్కరించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఎక్కడిబస్సులు అక్కడే ఆగిపోయాయి. 

జిల్లాకేంద్రంలోని బస్ డిపో వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నినదిస్తూ డిపో ఎదుట ఆందోళన చేప్పటారు. ప్రైవేట్ డ్రైవర్లను తాత్కాలికంగా నియమించుకుని అధికారులు బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టిసి డ్రైవర్లు, కండక్టర్లుగా తాత్కాలికంగా పనిచేసేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. 

ప్రస్తుతానికయితే జగిత్యాల బస్ డిపోలో బస్సులన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని బస్సులు మాత్రమే ప్రధాన రూట్లతో తిరుగుతున్నాయి. ఆ బస్సుల్లో కూడా ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది.