ర్నూలు జిల్లాలో మంగళవారం ఘెర ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు వాగులో ఒరిగింది. కాగా... ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. హోళగుంద మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి హెబ్బటం గ్రామసమీపాపంలో చల్ల వంక వాగు పొంగి పొర్లుతోంది. ...వాగును దాటేందుకు ప్రయత్నించిన ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి ఒరిగింది. 

దీంతో  ఒక్కసారిగా బస్సులోని ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో... బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఒక్కొక్కరుగా.. బస్సులో నుంచి దిగి కిందకు వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో పలువురు అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా... వాగులో పడిన బస్సును సంబంధిత అధికారులు వచ్చి.. బయటకు తీశారు. వాగులో నీరు ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. పలువురు ప్రయాణికులు మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.