Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు ఒక్కటే సరిపోదు... అవి కూడా కావాలి: రాయలసీమ విద్యార్థి సంఘాల డిమాండ్

రాయలసీమలో కేవలం హైకోర్టు మాత్రమే ఏర్పాటుచేసి న్యాయరాజధానిగా చేసినంత మాత్రాన సరిపోదని... అభివృద్ది విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపించాలని విద్యార్థి యువజన సంఘాలు వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. 

rayalaseema students organisations warning to YSRCP government
Author
Kurnool, First Published Jan 20, 2020, 7:58 PM IST

కర్నూలును న్యాయ రాజదానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టిన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద న్యాయవాద సంఘాలు, విద్యార్థి జేఏసీ, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కర్నూలు కలెక్టరేట్ ముందు బాణాసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. న్యాయ రాజధానితో సరిపెట్టకుండా ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా హైకోర్టు వల్ల పెద్దగా అభివృద్ధి జరగకపోవచ్చని... పరిశ్రమలు నీటి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ప్రజాసంఘాలు, విద్యార్థి జేఏసీ నేతలు తమ వాదనలు వినిపించారు. తమ మొర ఆలకించి పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు పరిచిన సీమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Video:రాజధాని కోసం సహాయ నిరాకరణ... పోలీసులకు మహిళల స్ట్రాంగ్ వార్నింగ్

తమ ఆందోళనలతో ఉద్యమాలతోనే ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయ విభాగాలు కర్నూలు దరిచేరుతున్నాయని గర్వంగా చెబుతున్నారు రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు. అయితే ఈ ఉద్యమం ఈ ఆందోళనలు ఇంతటితో ఆపమని కరువు కోరల్లో అల్లాడుతూ వలసల బాట పడుతున్న సీమ ప్రజల కష్టాలు తీరే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయకపోతే ఆందోళనలు చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు.

ఏది ఏమైనా తమ డిమాండ్ ను నెరవేర్చి సీమవాసుల చిరకాల కోరికను తీర్చిన ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సంబరాల్లో విద్యార్థి, న్యాయవాద, ప్రజాసంఘాల జేఏసీ నేతలు పాల్గొన్నారు. 

read more  అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు... కర్నూలులో న్యాయవాదుల సంబరాలు
 

Follow Us:
Download App:
  • android
  • ios