ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం జైత్రామ్ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. గ్రామంలో స్మశానవాటిక స్థల పరిశీలన విషయంలో సర్పంచ్, మాజీ సర్పంచ్ మద్య మొదలైన మాటలయుద్దం చిలికిచిలికి గాలివానలా మారింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే మాజీ సర్పంచ్ గుండెపోటుకు గురయి మరణించారు. 

జైత్రామ్ తండా సర్పంచ్ గా ప్రస్తుతం రేణుక అనే మహిళ సర్పంచ్ గా వున్నారు. అయితే ఆమె భర్త పరశురాంకు, మాజీ సర్పంచ్ రాథోడ్ గజానంద్ కు రాజకీయ విబేధాలున్నాయి. ఈ క్రమంలోనే స్మశానవాటికి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని చివరకు మాజీ సర్పంచ్ మృత్యువాడపడ్డారు. 

read more    72 ఇళ్లల్లో చోరీ.. డబ్బుతో లగ్జరీ ఇళ్లు.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

ఇరువర్గాల ఘర్షణలో ఓ కారు, మూడు బైక్ లు ద్వంసమయ్యాయి. అలాగే నాలుగు ఇండ్లు అగ్గికి ఆహుతయ్యాయి. ఈ గొడవపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు గ్రామంలో అదనపు బలగాలు, సాయుధ పోలీసులను మోహరించారు