కరోనా వైరస్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ ఒక్కరినీ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా బయటకు వస్తే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే... ఈ క్రమంలో డాక్టర్లు, జర్నిలిస్టులు.. పలువురికి మాత్రం మినహాయింపు ఇస్తున్నారు. దీనిని గమనించకుండా ఖమ్మం ఏసీపీ ఓ మెడికల్ స్టూడెంట్ పై చెయ్యి చేసుకున్నాడు. దీనికి బదులుగా యువతి కూడా అతనిపై తిరిగి దాడి చేసింది.

Also Read కరీంనగర్ ను వీడని కరోనా భయం... మరో వ్యక్తికి కరోనా లక్షణాలు...

పూర్తి వివరాల్లోకి వెళితే...ఖమ్మం ఏసీపీ గణేష్ రోడ్డుపైకి వచ్చినవారిని చెక్ చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరి బైకులు కార్లు  ఆపుతున్నారు. అదే సమయంలో కొందరు మెడికల్ విద్యార్థులు వెళుతూ కనిపించారు. వారిని ఏసీపీ అడ్డుకున్నారు.  డాక్టర్లు డ్యూటీ అని చెప్పి ఐడి కార్డు చూపించారు. ఐనా ACP మమత మెడికల్ కాలేజ్ విద్యార్థిని పై చేసుకున్నారు.

కోపంతో ఊగిపోయిన యువతి కూడా ఖమ్మం  ఏసీపీ  గణేష్ పై చేయి చేసుకుంది. ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విద్యార్థినిని  టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఖమ్మం  సీపీ తప్పి ఇక్బాల్ ప్రదేశానికి  చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాగా.. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.