ఎప్పుడు నేరస్తులు, గొడవలు, కొట్లాటలు చేతులతో హడావిడిగా ఉండే ఖాకీలు...కార్తీక మాసం సందర్భంగా కుటుంబాలతో ఉల్లాసంగా గడిపారు...ఎస్పీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన వన భోజనాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సమస్యలన్నీ మరిచి కొన్ని గంటలు హాయిగా గడిపారు...జిల్లా పోలీసు కార్యాలయంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం అందరి మనసులో కొత్త ఆనందాన్ని నింపింది….. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  కర్నూలు జిల్లా ఎస్ఐ పకీరప్ప హాజరయ్యారు

 కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ పరిపాలనా విభాగం ఉద్యోగులు గురువారం మధ్యాహ్నం స్దానిక జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఎస్పీ, డిఐజి స్టాఫ్, డిపిఓ సిబ్బంది అందరూ ఉసిరి చెట్టుకు పూజ నిర్వహించారు. అనంతరం ఎస్పీ  పోలీసుమినిస్టిరియల్ సిబ్బంది అందరితో కలిసి ఉసిరి చెట్టు క్రింద వనభోజనం చేశారు. 

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచి జరుగుతుందని, అందరూ ప్రతి సంవత్సరం ఈ విధంగా కుటుంబసభ్యులతో కలిసి ఇటువంటి కార్యక్రమాలను జరుపుకొని సంతోషంగా ఉండాలని  ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ రాధాక్రిష్ణ,  హోంగార్డు డిఎస్పీ  శ్రీ హనుమంతు, లీగల్ అడ్వైజర్ శ్రీ మల్లికార్జున రావు, ఎ ఓ శ్రీ సురేష్ బాబు, పోలీసు మినిస్టిరియల్ అసోషియేషన్ ప్రెసిడెంట్ బాల సుబ్రమణ్యం, మినిస్టిరియల్ అసోసియేషన్ సభ్యులు... నాయుడు,డిఐజి  కార్యాలయ సిబ్బంది, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు