కర్నూల్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పై శివరాంరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రషర్ మిషన్  కోసం తనను బెదిరించారని శివరాంరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. మిగిలిన 60 శాతం వాటా తమ పేరుపై బదిలీ చెయ్యాలని శివరామిరెడ్డి కుటుంబసభ్యులపై బెదిరింపులకు దిగారు.

దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు....ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తన భర్తపై హత్యాయత్నం చేసినట్లు శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీన భార్గవ్‌రామ్, అతడి అనుచరులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి అక్కడున్న వారిని తరిమేసి తాళాలు వేశారని మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత నెల 27వ తేదీన మరో పరిశ్రమను స్వాధీనం చేసుకుని రెండింటిని తమపేరిట రాసివ్వాలని డిమాండ్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ పై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేశారు. కొండాపురం లో వున్న క్రషర్ క్వారీ   ఫ్యాక్టరీ వివాదంలో యజమాని శివరామిరెడ్డి ఫిర్యాది మేరకు భార్గవ్ రామ్ తో సహా 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భార్గవ్ రామ్పి.ఏ. మహేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు.

ఈ కేసులో భార్గవ్ రామ్‌తో పాటు మాదల శ్రీను,నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి,శ్రీను, అల్లా సుబ్బయ్య,నాగేంద్ర,డ్రెవర్ గణేష్,మంగలి పవన్,సంపత్ నాని,షరీఫ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల  తర్వాత వరుసగా టీడీపీకి చెందిన నేతలపై కేసులు పెడుతున్నారు.కక్షపూరితంగానే తమ పార్టీకి చెందిన నేతలపై పోలీసులు
కేసులు పెట్టారని  టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీకి చెందిన కీలక నేతలపై కేసులు నమోదు కావడాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే తాజాగా కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదైంది. అయితే  క్రషర్ మిషన్  కోసం భార్గవ్ రామ్ బెదిరించాడని పిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.