కర్నూలు నగరం నుండి రాజధాని అమరావతి ప్రాంతానికి వివిధ పనులపై వెళ్లేవారికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ శుభవార్త చెప్పారు. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటో తారీకు నుండి ప్రతిరోజు రాత్రి ఓ ఎక్స్‌ప్రెస్ రైలు కర్నూల్ నుండి అమరావతికి నడవనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వేశాఖ నుండి తనకు సమాచారం అందిందని వెంకటేశ్ వెల్లడించారు. 

కర్నూల్ నగరంలోని అవుట్‌డోర్ స్టేడియంలో  జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కర్నూలు నుండి రాజధాని అమరావతికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తనకు స్థానికులు తెలియజేశారని... దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ చర్యలు తీసుకుందని టిజి తెలిపారు.  పిబ్రవరి 1వ తేదీ నుండి  ప్రతిరోజు రాత్రి అమరావతికి ఎక్స్  ప్రెస్ రైలును ఏర్పాటు చేయించామని చెప్పారు. 

గ్రామాల్లో పర్యటిస్తా... ప్రజలు ఎవరైనా చెయ్యెత్తితే....: అధికారులకు జగన్ హెచ్చరిక

అలాగే కల్లూర్ లోని ఐటీసీ సర్కిల్ వద్ద ఉన్న రహదారులపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని వాటిని నివారించేందుకు వీలుగా 45 నుండి 50 కోట్ల రూపాయలతో బ్రిడ్జి ఏర్పాటుకు  చేస్తున్నామని... ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జాతీయ రహదారి వెంట సర్వీస్ రహదారులు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని...ఈ విషయంలో కూడా జాతీయ రహదారి వెంట సర్వీస్ రహదారులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాజ్యసభ సభ్యుడు టిజి.వెంకటేష్ వివరించారు.

వీడియో

"