Asianet News TeluguAsianet News Telugu

పోలవరంను పరిశీలించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందం... ఆ ఫిర్యాదు వల్లే...

ఆంధ్ర ప్రదేశ్ లోని గోదావరి నదిపై నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణపనులను జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందం బుధవారం పరిశీలించింది.  

National Green Tribunal inspects Polavaram project
Author
Polavaram, First Published Jan 22, 2020, 6:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక భావించి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు పోలవరంను జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందం పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని, డంపింగ్ ప్రదేశాన్ని ఈ బృందసభ్యులు పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న తదితర విషయాలను పరిశీలించేందుకు ఈ బృందం పోలవరం ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. 

 సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదుమేరకు ఆయనతో కలిసి ఎన్‌జిటి బృందం పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు దగ్గరుండి ఎన్‌జిటి బృందం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. ఆయన కూడా ఈ బృందంతో కలిసి పోలవరం నిర్మాణ ప్రాంతంలో పర్యటించారు. 

read more  జగన్ నిర్ణయాలు... ఆ ప్రభుత్వ శాఖలు నిర్వీర్యమయ్యే ప్రమాదం: తులసి రెడ్డి

 ఈ సందర్భంగా సామాజికవేత్త పుల్లారావు మాట్లాడుతూ... మిగతా ప్రాంతాల వారికి ఇచ్చినట్లే పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందన్నారు. 

ప్రభుత్వం  ఇప్పటివరకూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. ఇక ఈ భారీప్రాజెక్టు నిర్మాణం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు కాలుష్యం ముప్పు తెస్తోందని ఆరోపించారు. గ్రీన్ ట్రిబ్యునల్ కు ఈ సమస్యలన్నింటి గురించి వివరించినట్లు తెలిపారు.

read more  మూడు రాజధానులపై మండలిలో చర్చ... బిజెపి స్టాండ్ ఇదే: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ట్రిబ్యునల్ బృందం కూడా సమస్యల పరిష్కారంపై  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ట్రిబ్యునల్ వల్ల కాకపోతే  దేశంలోని అన్ని కోర్టులు, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించి న్యాయం జరిగే వరకూ పోరాడతానని పుల్లారావు ప్రకటించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios