ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక భావించి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు పోలవరంను జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందం పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని, డంపింగ్ ప్రదేశాన్ని ఈ బృందసభ్యులు పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న తదితర విషయాలను పరిశీలించేందుకు ఈ బృందం పోలవరం ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. 

 సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదుమేరకు ఆయనతో కలిసి ఎన్‌జిటి బృందం పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు దగ్గరుండి ఎన్‌జిటి బృందం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. ఆయన కూడా ఈ బృందంతో కలిసి పోలవరం నిర్మాణ ప్రాంతంలో పర్యటించారు. 

read more  జగన్ నిర్ణయాలు... ఆ ప్రభుత్వ శాఖలు నిర్వీర్యమయ్యే ప్రమాదం: తులసి రెడ్డి

 ఈ సందర్భంగా సామాజికవేత్త పుల్లారావు మాట్లాడుతూ... మిగతా ప్రాంతాల వారికి ఇచ్చినట్లే పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందన్నారు. 

ప్రభుత్వం  ఇప్పటివరకూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. ఇక ఈ భారీప్రాజెక్టు నిర్మాణం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు కాలుష్యం ముప్పు తెస్తోందని ఆరోపించారు. గ్రీన్ ట్రిబ్యునల్ కు ఈ సమస్యలన్నింటి గురించి వివరించినట్లు తెలిపారు.

read more  మూడు రాజధానులపై మండలిలో చర్చ... బిజెపి స్టాండ్ ఇదే: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ట్రిబ్యునల్ బృందం కూడా సమస్యల పరిష్కారంపై  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ట్రిబ్యునల్ వల్ల కాకపోతే  దేశంలోని అన్ని కోర్టులు, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించి న్యాయం జరిగే వరకూ పోరాడతానని పుల్లారావు ప్రకటించారు.