నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను కాపాడి, వారికి ప్రాణదానం చేశారు.

వివరాల్లోకి వెళితే.. నంద్యాల కల్పనా సెంటర్‌కు చెందిన ప్రవీణ్ కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. వారంతం కావడంతో వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వెనుక వున్న కుందూనది వంతెన వద్దకు వెళ్లారు.

Also Read:ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలపై కేంద్ర సంస్థతో దర్యాప్తు: ఆ 7 అభియోగాలు ఇవే

ఈ క్రమంలో ప్రవీణ్ సెల్పీ దిగుతుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. అతనిని కాపడేందుకు విష్ణువర్థన్ రెడ్డి నదిలోకి దూకే క్రమంలో పక్కనే వున్న రాళ్లపై పడ్డాడు. ఈ నేపథ్యంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి వారి అరుపులను విన్నారు.

వెంటనే వాహనం ఆపి అనుచరులతో కలిసి యువకులను కాపాడారు. తీవ్రంగా గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్థన్ పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటంతో అతనిని కర్నూలుకు తరలించారు.

Also Read:ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌:కేశినేనిసెటైర్లు, కౌంటరిచ్చిన ఐపీఎస్ అధికారి

అయితే కళాశాలలో తనతో పాటు చదువుకుంటున్న ఓ యువతి ప్రేమ పేరుతో ప్రవీణ్‌ను మోసం చేసిందని.. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. మిత్రుడిని కాపాడే క్రమంలో విష్ణువర్థన్ తీవ్రగాయాల పాలయ్యాడని అంటున్నారు. కాగా ఇద్దరు యువకులను కాపాడిన ఎమ్మెల్యే రవిచంద్రను ప్రజలు అభినందిస్తున్నారు.