నంద్యాల: మద్యం సేవించడానికి భార్య 50 రూపాయలు డబ్బులు ఇవ్వలేదని మనస్థాపానికి గురైన సలామ్ వ్యక్తి బ్లేడ్ తో గొంతుకోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 

వివరాల్లోకి వెళ్తే... నంద్యాల పట్టణంలోని చాంద్ బడ ప్రాంతానికి చెందిన సలాం పాత ఇనప సామాన్ల దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రోజు సంపాదించిందంతా మద్యం సేవించడానికి ఖర్చు చేశాడు. ఆదివారంనాడు మళ్లీ మద్యం సేవించడానికి భార్యను డబ్బులు 50 రూపాయలు ఇవ్వాలని అడిగాడు. 

నిరాకరించడంతో భార్యతో గొడవపడ్డాడు. దాంతో మనస్తాపానికి గురైన సలాం ఇంట్లో ఉన్న బ్లేడ్ తీసుకొని గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర రక్తస్రావంతో ఉన్న స్థలాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

బాధితుడు సలాంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు  వైద్యులు తెలిపారు.