రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు స్వయంగా ప్రభుత్వమే మార్కెట్లోకి దిగేందుకు సిద్దమైందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. ముఖ్యంగా టమాట, ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వమే మార్కెటింగ్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలిపారు. 

టొమాటో వంటి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆలోచనలో వుంది. టొమాటో పల్ప్ తయారీ కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయనుందని ఆయన ప్రకటించారు. ఉల్లి, టమాట వంటి పంటలే కాకుండా అవసరమైన మేరకు మిగిలిన పంటలను కొనుగోలు చేయాలని ఆలోచన ప్రభుత్వానికి వుంది. వివిధ నకాల ప్రభుత్వ 

హాస్టళ్లు, అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వం కొనుగోళ్లు చేసిన పంటలను ప్రాసెస్ చేసి సరఫరా చేయాలన్న ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో దళారీ వ్యవస్థను నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

రైతు సంక్షేమం విషయంలో సీఎం జగన్ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది ఆశించిన స్థాయి కంటే అధికంగా పంట దిగుబడి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. అలాగే ఇప్పటికే  ఉల్లి ధరలను కంట్రోల్ చేశామని తెలిపారు.అందుకోసం ధరల స్థిరీకరణ నిధి నుంచే డబ్బులు ఖర్చు పెట్టామని అన్నారు.