నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తానని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.

సంగారెడ్డి జిల్లాలో హరిశ్ రావు గారి పర్యటన సందర్భంగా 4కోట్ల తో నిర్మించుకున్న పశువైద్య శాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో , ఉమ్మడి జిల్లా మంత్రి గా సంగారెడ్డి జిల్లా ను ,నియోజకవర్గాన్ని అన్ని విధాలా, సమగ్ర అభివృద్ధి కు కృషి చేస్తానన్నారు..

ఈరోజు సంగారెడ్డి లో ₹2కోట్ల తో మినీ హజ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం అని, ₹5కోట్ల తో పశువైద్య శాలను ప్రారంభించుకున్నాం అన్నారు, కోటి 40 లక్షలతో ఇంద్రకరణ్ గ్రామములో 33/11 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించుకున్నాం అని చెప్పారు..

మొత్తంగా పదిన్నర కోట్లతో వివిధ పనులను ఈరోజు ప్రారంభించమన్నారు.. సంగారెడ్డి జిల్లా , నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ,దశలవారీగా నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తాన్నారు,

నియోజకవర్గంలో పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కావొచ్చు, కాళేశ్వరం ద్వారా సంగారెడ్డి కి గోదావరి జలాలు తెచ్చే విషయం లో కావొచ్చు అన్నివిధాలా అభివృద్ధి కి కృషి చేస్తానని చెప్పారు .. 

మనుషులకె కాదు...మూగ జీవాలకు అధునాతన వైద్యం:
సంగారెడ్డి జిల్లా కంది మండలం కాజిపూర్ గ్రామ పరిధిలో 5కోట్ల తో నిర్మించిన పశువైద్య శాల నూతన భవనాన్ని మంత్రి హరీష్ రావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఇది 5కోట్ల తో నిర్మించామని , 4కోట్ల తో భవనం, కోటి రూపాయలతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు..

ఇది పశువులకు రెఫరల్ ఆసుపత్రి అని..జిల్లాలో ఏ పశువైద్య శాల లో మూగ జీవాలకు చికిత్స చేసి, అపరేషన్ అవసరం ఉంటె ఈ వైద్య శాలకు రెఫర్ చేయొచ్చన్నారు.

.ఇందులో ఆపరేషన్ థియేటర్ , ఎక్స్ రే, ఇండోస్కోప్ ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేశామని చెప్పారు..మనషులకే కాదు మూగ జీవాలకు కు అన్ని వసతులతో అధునాతన సౌకర్యాలతో వైద్య శాల ఏర్పాటు చేశామన్నారు...