Asianet News TeluguAsianet News Telugu

ఆటోలో తిప్పి ఆరుగురు యువకులు వివాహితపై గ్యాంగ్ రేప్

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో ఓ వివాహితపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విదేశాలకు వెళ్లడానికి సిద్ధమైన తరుణంలో మహిళపై ఈ సంఘటన జరిగింది.

Married woman gang raped at Marteru in West Godavri district
Author
Penumantra, First Published Sep 12, 2019, 9:10 AM IST

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో దారుణ సంఘటన జరిగింది. ఓ వివాహితపై మంగళవారం రాత్రి ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్ది రోజుల్లో విదేశాలకు వెళ్లేందుకు విమానం టికెట్, నగదు చేసుకున్న తరుణంలో మహిళపై ఆ ఘాతుకం చోటు చేసుకుంది. 

ఆచంట మండలం అచంట వేమవరానకిి చెందిన వివాహిత (24) మంగళవారం రాత్రి పాలకొల్లుకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా గల్ఫ్ ఏజెంట్ పింగళి రమేష్ మార్టేరులో ఆగాల్సిందిగా చెప్పాడు. దాంతో ఆమె అక్కడ వేచి చూడసాగింది. అతను ఎంతకీ రాలేదు. దీంతో తానే అతని వద్దకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. 

అందులో ఎక్కిన ఆరుగురు వ్యక్తులు ఆమెను బంధించి పాలకొల్లు వైపు తీసుకుని వెళ్లారు. రాత్రి పది గంటల వరకు తిప్పి ఓ మూడంతస్థుల భవనంలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న 15 వేల రూపాయల నగదు, విమానం టికెట్, ఎటిఎ కార్డు తీసుకుని పారిపోయారు. 

విమానం టికెట్, ఏటిఎం కార్డు ఇవ్వాలని మహిళ వేడుకుంది. ఏజెంట్ రమేష్ ను అడగాలని చెప్పి వారు వెళ్లిపోయారు. కోలుకున్న తర్వాత గది నుంచి బయటకు వచ్చి పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అయితే, అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఆధార్ కార్డు ఉంటేనే చికిత్స చేస్తామని వైద్యులు చెప్పారు .దాంతో తాను ఆచంటకు వచ్చి ఆస్పత్రిలో చేరినట్లు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పెనుమంట్ర ఎస్ఐ బి. శ్రీనివాస్ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios