కర్నూల్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది.. అభం శుభం తెలియని ఓ చిన్నారిపై గుర్తుతెలియని అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు...అతని ప్రయత్నాన్ని ప్రతిఘటించిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో తన గుట్టు బయట పడుతుంది అన్న ఎంతో బండరాయితో మోది చంపే ప్రయత్నం చేశాడు.

కాగా..  బాలిక అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి పరుగులు తీశారు. అప్పటిచే బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వెంటనే బాలికను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... 

పూర్తి వివరాల్లోకి వెళితే... ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానికంగ ఉన్న ఉష ఫ్యామిలీ రెస్టారెంట్ వెనుక ప్రాంతంలో...నిర్మానుష్యమైన ప్రదేశంలో బాలికపై  ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు.  అయితే ఆ బాలిక తన శక్తినంతా కూడగట్టుకుని తీవ్రంగా బాలిక ప్రతిఘటించే ప్రయత్నం చేసింది...దీంతో సహనం కోల్పోయిన  మానవ మృగం రెచ్చిపోయి ప్రక్కనే పడి ఉన్న బండ రాయి తీసుకొని తలపై  కొట్టి చంపే ప్రయత్నం చేశాడు.

సకాలంలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు... సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మిగనూరు టౌన్ పోలీస్ లు కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.... తీవ్ర గాయాలపాలైన మైనర్ బాలిక ప్రస్తుతం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.. అయితే ఈ సంఘటన ఎమ్మిగనూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ కుత వేటు దూరం  చోటు చేసుకుంది.

ఎంతో  సమయం అయిన  బాలిక ఇంటికి రాకపోవడంతో వెతకడం మొదలు పెట్టిన తల్లిదండ్రుల కు బాలిక అపస్మారక స్థితిలో పడిఉండటం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు...అయితే బాలిక తలపై ఒంటి పై గాయాలు ఉండటం తో అత్యాచారం చేసి గయపరిచాడ అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..