క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. డ్రైవర్ అతి తొందరపాటు కారణంగా ఓ ప్రయాణికుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో  చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుల్ని ఎక్కించుకున్నాడు. అదే సమయంలో అక్కడకు పోలీసులు రావడంతో డ్రైవర్ కంగారులో హడావిడిగా కారు తీశాడు.

అయితే.... ఓ ప్రయాణికుడు పూర్తిగా కారులోకి ఎక్కలేదు. అతని షర్ట్ మాత్రం కారు డోరులో ఇరుక్కుపోయింది. ఆ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ గమనించలేదు. పోలీసుల నుంచి తప్పించుకోవాలనే కంగారులో ఆపకుండా దాదాపు 8కిలోమీటర్లు క్యాబ్ ని పోనిచ్చాడు. సదు ప్రయాణికుడు క్యాబ్ తో సహా 8కిలోమీటర్ల ఈడ్చుకుంటూ వచ్చాడు.  అంత దూరం క్యాబ్ ఈడ్చుకురావడంతో... ప్రయాణికుడు యాదయ్యకు తీవ్రగాయాలయ్యాయి.

దీంతో అతను తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చిచెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.