మెట్రో స్టేషన్ లో యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి మెట్రో స్టేషన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...శనివారం ఓ వ్యక్తి మెట్రో స్టేషన్ లో పైకి ఎక్కి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడగా... గమనించిన మెట్రో అధికారులు అతనిని చికిత్స నిమిత్తం  సరూర్ నగర్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనపై మెట్రో స్టేషన్ కంట్రోలర్ హరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ...ఓ వ్యక్తి శనివారం మెట్రో మెట్లు ఎక్కి పైకి వచ్చి... అక్కడ నుంచి కిందకు దూకాడు. చూసిన మెట్రో అధికారులు అతనిని దూకొద్దని గట్టిగా అరిచారని... అప్పటికే అతను కిందకు దూకేశాడని చెప్పారు. వెంటనే మెట్రో అధికారులు  సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని... ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని... కోలుకుంటున్నాడని  చెప్పారు. కాగా.... అసలు అతను ఎవరు అన్న విషయం మాత్రం ఇంకా తెలీలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

2018 నవంబర్ లో కూడా ఈ మెట్రో స్టేషన్ లోనే పై నుంచి కిందకు దూకేందుకు  ప్రయత్నించింది. కాగా.. ఆమెను మెట్రో అధికారులు అడ్డుకున్నారు. 2018 నవంబర్ లో అమీర్ పేటలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.