ప్రముఖ శైవ క్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని గత 11 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయ అర్చకులు ఆదివారం పూర్ణాహుతితో ముగింపు పలికారు.

Also Read:వివిధ ప్రాంతాలలో మహాశివరాత్రి

10వ రోజైన ఈ రోజు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహాదశీర్వచనం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కేఎస్ రామారావు దంపతులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Also Read:మహాశివరాత్రి వ్రత కథ

సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, పగడం, నూతన వస్త్రాలు, మొదలై ద్రవ్యాలను హోమ గుండంలోకి ఆహుతిగా సమర్పించి రుద్రయాగం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వసంతాన్ని భక్తులపై ప్రోక్షించారు. తర్వాత చండీశ్వర స్వామికి ఆలయ ప్రాంగణంలో గల మల్లికా గుండంలో వైదిక శాస్త్రోక్తంగా అవభృద స్నానం నిర్వహించారు.