Asianet News TeluguAsianet News Telugu

భూమి కోసం... తండ్రికొడుకులను కర్రలతో చితకబాదిన ప్రత్యర్ధులు

భూమి కోసం చెలరేగిన వివాదం ఓ రైతు ప్రాణాలను బలితీసుకోవడమే కాదు అతడి కొడుకును చావుబ్రతుల్లోకి నెట్టింది. 

land issue... murder attempt on father and son
Author
Kurnool, First Published Feb 5, 2020, 9:51 PM IST

కర్నూలు జిల్లా అవుకు మండలం లోని చనుగొండ్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. చిన్న పుల్లారెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు కర్రలతో కొట్టి చంపడమే కాదు అడ్డు వచ్చిన అతడి కుమారుడు శివారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

చనుగొండ్ల గ్రామంలోని సర్వేనెంబర్ 105 లో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు పొలం ఉంది. ఈ పొలంపై చిన్న పుల్లారెడ్డి కి అదే గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డికి భూ వివాదం నెలకొని ఉంది. దీంతో ఈ భూమికోసం తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలోనే బుధవారం ఉదయం చిన్న పుల్లారెడ్డి అతని కొడుకు శివారెడ్డిలు పొలం వద్దకు వెళ్లారు. అదే సమయంలో  చిన్న ఓబుల్ రెడ్డి,  పరమేశ్వర్ రెడ్డి చెన్నకేశవరెడ్డి, మోహన్ రెడ్డిలు కట్టెలతో తీసుకొని వారిపై దాడి చేశారు. ఈ ఘర్షణలో చిన్న పుల్లారెడ్డి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యలో మృతిచెందాడు.

శివారెడ్డి కూడా ఈ దాడిలో గాయపడ్డాడు. అయితే అతడు ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థికి కూడా విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పుడే అతడి పరిస్థితి గురించి చెప్పలేమన్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అవుకు ఎస్ఐ  శ్రీకాంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నబాధితుడు శివారెడ్డిని పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios