Asianet News TeluguAsianet News Telugu

నా పెళ్లికి రండి: అహోబిల నరసింహుడి పిలుపు

కర్నూల్ జిల్లా అహోబిల నరసింహుడి పార్వేట ఉత్సవం గురువారం నాడు ప్రారంభమైంది.

Kurnool: Paruveta utsavam starts in Ahobilam temple
Author
Kurnool, First Published Jan 16, 2020, 6:06 PM IST


కర్నూల్:తన వివాహానికి భక్తులను తానే స్వయంగా అహోబిల నరసింహుడు ఆహ్వానించనున్నారు. గురువారం నుండి అహోబిల నరసింహాస్వామి పారువేట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఎగువ అహోబిలం  నుంచి పారువేట ఉత్సవంకోసం కొండ దిగివచ్చిన అహోబిలేశుడు.అహోబిలం లోని చెంచులు తన బావ అయిన అహోబిలేశుని పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు.

Also read:శ్రీశైలంలో అంబరాన్ని అంటిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

 స్వామివారికి మామిడి తోరణాలు,  పార్వేట పల్లకి కి అడవి నారతో అహోబిల చెంచులు విల్లంబులతో నాట్యమాడుతూ దిగువ అహోబిలం కు అహోబిలేశుడిని  కిందకు తీసుకొచ్చారు.45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో   33 గ్రామ ప్రజలకు స్వామి వారు స్వయంగా వెళ్లి దర్శనభాగ్యం కల్పిస్తారు....

ప్రపంచంలో ఎక్కడైనా భక్తులే భగవంతుడి వద్దకు వెళుతుంటారు. దైవమే భక్తుల వద్దకు వెళ్లే సందర్భం మాత్రం  ఒకే ఒక్కచోట ఉంటుంది. అది అహోబిల లక్ష్మీనరసింహ స్వామికే ప్రత్యేత.

 600 సంవత్సరాల నుంచి అనాది వస్తున్న ఆచారం ప్రకారం అహోబిలం క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరద స్వాములు పల్లకిలో కొలువై గ్రామాలకు వెళ్లి భక్తులకు తమ దర్శన భాగ్యం కల్పిస్తారు.  భక్తులను తమ పెళ్లికి రండి అని ఆహ్వానం పలికే  ఈ ప్రత్యేకమైన వరాన్ని కర్నూలు జిల్లాలోని 33 గ్రామాల ప్రజలు అందుకుంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios