కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలోని మహా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళరకు దిగారు. విధులను బహిష్కరించిన కార్మికులు తమ డిమాండ్లను అంగీకరించాలంటూ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్యాక్టరీ ఎదుట బైఠాయించి తమ నిరసనను వ్యక్తం  చేశారు. 

గత మూడు సంవత్సరాల నుండి ఇదే కంపనీలో  పనిచేస్తున్నా తమ జీతభత్యాలు మాత్రం పెరగడం లేదని కార్మికులు ఆవేధన వ్యక్తం చేశారు. యాజమాన్యం లాభాలబాటలో వున్నా తమ జీతాలు, జీవితాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ దసరాకైనా తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని ధైర్యంచేసి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనకు దిగినట్లు కార్మికులు తెలిపారు. 

తెలుగు ప్రజలకు పెద్ద పండుగైన దసరా వచ్చిందంటే అన్ని కంపనీలు తమ సిబ్బందికి బోనస్ లు ప్రకటిస్తుంటాయి. అలాగే  కొన్ని సంస్థలు జీతభత్యాలను కూడా పెంచుతుంటాయి. కానీ తాము ఇక్కడ మూడు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న ఇప్పటి వరకు తమ జీతభత్యాలను ఒక్కసారి  కూడా పెరగలేవన్నారు. తమపై కంపనీ యాజమాన్యం కనికరించడం లేదని కార్మికులు వాపోతున్నారు.

ప్రతి సంవత్సరం ఈ దసరా సమయంలో జీతభత్యాలు పెరుగుతాయని ఆశించడం...  పండగ అయిపోయిన తర్వాత నిరుత్సాహ పడటంకు మాకు అలవాటుగా మారిపోయింది. అందుకే ఈసారి మాత్రం మళ్లీ జీతభత్యాల విషయంలో నిరుత్సాహపడాల్సి వస్తోంది.అందువల్లే విధులు బహిష్కరించి ఆవేశంగా ఓ అడుగు ముందుకేశామని  తెలిపారు. తమ జీతభత్యాలు పెంచే వరకు విధులకు హాజరు కామని యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశారు. 

సంబంధిత వీడియో

మహా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన (వీడియో) ...