హైదరాబాద్: హూజూర్ నగర్ నుంచి పంపించేందుకే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రజలు లోకసభకు ఎన్నుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఖరారు చేసిన విషయం తెలిసిందే. 

హుజూర్ నగర్ లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీయేనని ఆయన శనివారం మీడియాతో అన్నారు. విజయం తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను కేసీఆర్ ను కలిసినట్లు తెలిపారు. హుజూర్ నగర్ లో తమ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని అంశాలవారీగా వివరిస్తామని ఆయన చెప్పారు. 

కాసోజు శంకరమ్మతో ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హుజూర్ నగర్ టీఆర్ఎస్ టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి శానంపూడి సైదిరెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 

హుజూర్ నగర్ లో విజయం తమదేనని జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద బండి నడకేనని ఆయన అన్నారు. మెజారిటీ ఎంత వస్తుందనేదే ప్రధానాంశమని అన్నారు. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో స్థానికేతరుడని ఆయన అన్నారు. పోటీ ఏమైనా ఉంటే బిజెపితోనే ఉంటుందని, బిజెపి ప్రభావం ఉండదని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ