కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఇంటి గోడల్లో దాచిన ఓ తుపాకీ, తుటాలు బయపడ్డాయి. భారీ వర్షం కారణంగా శిథిలావస్థలో వున్న ఇంటి గోడ కూలడంతో రివాల్వర్, తూటాలు వెలుగుచూశాయి. ఈ ఘటన నియోజకవర్గ పరిధిలో కలకలం సృష్టించింది. 

రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి పూర్వీకులు నిర్మించిన ఇంట్లోనే కుటుంబంతో సహా నివాసముంటున్నాడు. అయితే శిదిలావస్థలో వున్న ఆ ఇల్లు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మరింత దెబ్బతింది. దీంతో గోడకూలి అందులో దాగివున్న ఒక రివాల్వర్, 12 తూటాలు బయటపడ్డాయి. 

వీటిని గుర్తించిన ఇంటి యజమాని సుబ్బరాయుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు రివాల్వర్, 12 తూటాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ తుపాకీకి సంబంధించిన వివరాలేమైనా లబిస్తాయేమోనని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.