విశాఖపట్నం: వెఎస్సార్‌సిపి ప్రభుత్వం ఇటీవలే నియమించిన వార్డ్ వాలంటీర్లు ఆ పార్టీ కలెక్షన్ ఏజెంట్లుగా మారారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.  గతంలో ప్రభుత్వ ఇళ్ల కోసం డిడిలు తీసిన వారి ఇళ్లకు వెళ్లి వీరు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరి అక్రమాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని పేర్కొన్నారు.

ఎవరయితే ముందుగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుని డిడిలు కట్టారో వారికే ముందుగా ఇల్లు కేటాయించాలని అధికారులకు సూచించారు. వైసీపీ కలెక్షన్ ఏజెంట్లయిన గ్రామ వాలేంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముందుగా ఇళ్లు రావాలంటే డబ్బులు చెల్లించాలని దబాయిస్తున్న తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

read more  బాలికపై అత్యాచారం... నిందితుడికి పోలీస్, పొలిటికల్ సపోర్ట్...: టిడిపి

జీవీఎంసీ కమీషనర్, జిల్లా కలెక్టర్లు పేదలకు న్యాయం చేయాలని కోరారు. అధికార పార్టీ పెద్దలు, నాయకులకు భయపడవద్దని... వారి మాటలు వినవద్దని సూచించారు.  అలా చేస్తే పేదలకు కాకుండా వైఎస్సార్‌సిపి నేతలు, కార్యకర్తలకే ఇళ్లు వస్తాయని... నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం అధికారంలో వున్న జగన్ ప్రభుత్వ మద్య నిషేధం పేరుతో వైన్ షాపులను హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ హయాంలో  నడిచే వైన్స్ లో రాత్రి 8 తరువాత అంతా బ్లాక్ లోనే విక్రయం జరుగుతుందని ఆరోపించారు.డిఫెన్స్ మద్యం సైతం ప్రభుత్వ షాపుల్లో అమ్ముతున్నారని... అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు.

read more  బహిరంగ ప్రదేశాల్లో బాణా సంచా కాల్చకూడదు: కర్నూల్ ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

రివర్స్ టెండరింగ్ పేరుతో సీఎం జగన్ రివర్స్ పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు ముఖ్యమంత్రి జగన్,  మంత్రి బొత్స సత్యనారాయణ కు తెలియడం లేదా...లేక తెలిసినా తెలియనట్లు వుంటున్నారా అని సెటెర్లు విసిరారు. ఒకవేళ తెలిస్తే చర్యలు చెప్పట్టండని బండారు సూచించారు.