Asianet News TeluguAsianet News Telugu

అనంతపురం: తహశీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేగింది. 

farmer suicide attempt in anantapur district
Author
Anantapur, First Published Nov 11, 2019, 3:35 PM IST

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేగింది. ఎన్ని రోజులుగా తిరుగుతున్నా తన భూ సమస్య పరిష్కారం కావడం లేదని మనస్తాపానికి గురైన జయరామిరెడ్డి అనే రైతు తహశీల్దార్ కార్యాలయం ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అతని పరిస్ధితి విషమంగా ఉండటంతో పోలీసులు జయరామిరెడ్డిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి హుటాహూటిన తరలించారు. రెండేళ్ల క్రితమే ఇళ్లు, స్థలానికి చెందిన పట్టాను ప్రభుత్వం అతనికి మంజూరు చేసింది.

అయితే సంవత్సరం నుంచి కొంతమంది నాయకులు సదరు రైతుకు ఆ స్థలం దక్కనీయకుండా అడ్డుకుంటున్నారని భార్య పల్లవి తెలిపారు. కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నప్పటికీ.. తహశీల్దార్ పట్టించుకోకపోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పల్లవి వాపోయారు. 

Also Read:భూమి కోసం ఆరాటం... తహసీల్దార్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

కొద్దిరోజుల క్రితం కడప జిల్లా కొండాపురం మండలంలోని దత్తపురం గ్రామానికి చెందిన బుడిగి ఆదినారాయణ(46) అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు.

కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామం 122 సర్వేనెంబర్‌లో 10.94ఎకరాల డీకేటీ భూమి ఉంది. ఇందులో 3.50 ఎకరాల భూమికి బుక్కపట్నం గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి గండికోట ప్రాజెక్టు కింద ముంపు పరిహారం తీసుకున్నాడు. 

మిగిలిన భూమిలో నరసింహులు, ఆదినారాయణకు మధ్య వివాదం ఉంది. ఇందులో 3.50 ఎకరాలు తన తండ్రి పేరుతో ఉందని, చాలా కాలం నుంచి తమ అనుభవంలో ఉందని, ఆ భూమిని తన తల్లి పేరుమీద ఆన్‌లైన్‌ చేయాలంటూ ఆదినారాయణ ఐదు సంవత్సరాల కిందట హైకోర్టును ఆశ్రయించారు.

మూడు సంవత్సరాల నుంచి ఆన్‌లైన్‌లో భూమిని నమోదు చేయాలంటూ తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తరచూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రైతు ఆదినారాయణ తహసీల్దార్‌ కార్యాలయం చేరుకున్నాడు.

చాంబర్‌లో ఉన్న తహసీల్దార్‌ మాధవ కృష్ణారెడ్డి ఎదుట తన ఒంటిపై బాటిల్‌లోని పెట్రోలు పోసుకున్నాడు. వెంటనే అప్రమత్త మైన సిబ్బంది ఆదినారాయణను పక్కకు లాగి నీళ్లు చల్లి పోలీసులకు అప్పజెప్పారు.

Also Read:భవన నిర్మాణ కార్మికులకు జనసేన అండ... పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

కాగా... ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ లో భూమి వివాదంలో ఓ రైతు తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో తహసీల్దార్ సజీవదహనమయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో... ఇలాంటి ఘటనలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios