కడప: జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం  చదువుతున్న మంజునాథరెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ లోని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

కాలేజీ యాజమాన్యం వేదింపులు తట్టుకోలేకే ఇతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. హాజరుశాతం తక్కువగా వుండటంతో కాలేజీ సిబ్బంది మంజునాథ్ ను పరీక్షలకు అనుమతించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనయిన అతడు హాస్టల్ గదిలో మిగతా విద్యార్థులు లేని సమయం చూసి ఉరి వేసుకున్నాడు.

read more  భార్యాభర్తల గొడవ... సెటిల్ మెంట్ చేసిన పెద్దమనిషి దారుణ హత్య

రూంమేట్స్ వచ్చేసరికి సీలింగ్ ప్యాన్ కు మంజునాథ్ శవం కనిపించింది. దీంతో వారు వెంటనే వారు కాలేజీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి  చేరుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

స్థానిక పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని హాస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన గదిల్ో ఆధారాల కోసం గాలింంపు చేపట్టగా సూసైడ్ నోట్ వంటివి ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

read more  హైదరాబాద్: జల్సా కోసం రప్పించి వేధింపులు, 100కు బాధితురాలి కాల్

ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి మంజునాథ్ మైదుకూరుకు చెందినవాడిగా సమాచారం. వ్యక్తిగత కారణాలతో అతడు తరచూ కాలేజీకి డుమ్మా కొట్టేవాడని...దీంతో హాజరుశాతం తగ్గినట్లు తోటి విద్యార్ధులు తెలిపారు. అందువల్ల కాలేజీ యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదని... ఇదే అతడి ఆత్మహత్యకు కారణమై  వుంటుందని అనుమానం వ్యక్తం చేశారు.