అనుకున్న కోరికలు తీర్చుకుని మొక్కులు చెల్లించేందుకు శ్రీశైల మహా క్షేత్రంలో కొలువైన భ్రమరాంబికా దేవి అమ్మవారికి హైదరాబాదుకు చెందిన సరోజిని బంగారు వడ్డానం హారాలను అమ్మవారికి సమర్పించారు. బంగారు వడ్డానం, బంగారు హారం, బంగారు కుంకుమ భరణీ , బంగారు గాజులు , బంగారు ఆభరణం,  సాదా వెండి నామాలు , వెండి గ్లాసు, వెండి పళ్ళెం సమర్పించారు.

180 గ్రాముల బంగారుతో తయారుచేసిన వడ్డానం, 39 గ్రామాలతో లక్ష్మీ డాలర్ తో హారం, అలాగే 19 గ్రాముల 510 మిల్లీ గ్రాముల తో బంగారు కుంకుమ భరణి,10 గ్రాముల తో బంగారు గాజులు, 10 గ్రాముల తో సాదా డాలర్ ను సమర్పించారు. అదే విధముగా 21 గ్రాముల వెండి నామాలు, 70 గ్రాముల వెండి గ్లాసు, 495 గ్రాముల వెండి పళ్ళెం ని కూడా సమర్పించారు.

Also Read హైకోర్టు ఒక్కటే సరిపోదు... అవి కూడా కావాలి: రాయలసీమ విద్యార్థి సంఘాల డిమాండ్..


వీరికి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వదించిన మండపంలో సహాయ కార్యనిర్వాహణాధికారి డి మల్లయ్య, పర్యవేక్షకులు మల్లికార్జున రెడ్డి అర్చకులు వేదపండితులుకి దాత సరోజినీ అందజేశారు. వీరికి వేద ఆశీర్వచనం చేయించి శేష వస్త్రాలను ప్రసాదాలను అందజేశారు.