రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై ఆంధ్ర ప్రదేశ్ సిపిఐ శాఖ నిరసనబాట పట్టింది. కర్నూల్ నగరంలో ఏర్పడ్డ ఇసుక కొరతపై నిరసనగా సీపీఎం పార్టీతో పాటు అనుబందం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో భవన కార్మికులు సంఘం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని ముట్టడించారు. 

జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇసుక కొరతతో కర్ములికులు ఉపాధి కోల్పోయారని వారు ఆరోపించారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక కొరతను తీర్చి 5 నెలలుగా ఉపాధి కోల్పోయి నష్టపోయిన భవన కార్మికులకు రూ.10 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

స్థానిక కార్మికుల పక్షాన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చొరవ తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. అలాగే నగరంలో ఇసుక కోరత లేకుండా చర్యలు తీసుకొని తమ ఉపాధిని పునరుద్దరించాలని భవన నిర్మాణ కార్మికులు సూచించారు.