అనుమానాస్పద స్థితిలో ఓ పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటుచేసుకుంది. హనుమాన్ పేట పోలీస్ క్వార్టర్స్ లో నివసించే సీఐ సూర్యనారాయణ గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో తన గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకున్నాడు. కాగా.... సంఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

1989 బ్యాచ్‌కు చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా  విజయవాడ ఏఆర్‌ గ్రౌండ్స్‌లో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం కారణంగానే సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.