ఆర్టీసీ సమ్మె కారణంగా మంచిర్యాల జిల్లాలో  ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, మరియు కండక్టర్ లను నియమించి బస్సులను నడుపుతున్నారు.

అయితే తాత్కాలిక డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చర్చల ద్వారా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించివుంటే సమ్మె జరిగేది కాదని మల్లు తెలిపారు.

ప్రజల అవసరాలు, పాలనను పట్టించుకోని ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దేనన్నారు. చర్చలు జరపాల్సంది సంబంధిత మంత్రులు మాత్రమేనని అంతేకాని ఐఏఎస్ కమిటీ కాదని విక్రమార్క ఎద్దేవా చేశారు