శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా దేశంలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. క్షుద్రపూజల అనుమానంతో ఎంతోమందిని కొట్టి చంపడమో, వూరి నుంచి వెలివేయడమో మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. బుధవారం అర్ధరాత్రి మండలంలోని ఆరిపాటి దిబ్బల సమీపంలోని జామాయిల్ తోటలో దున్నపోతు అరుపులు, మంత్రాల శబ్ధం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి నిద్రలోంచి లేచారు.

Also Read:మహిళను వివస్త్రను చేసి హత్య... క్షుద్రపూజలు చేశారంటూ..

ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్తులు జామాయిల్ తోటకు వెళ్లి చూడగా.. అక్కడ నిమ్మకాయలు, రక్తం, పసుపు, కుంకుమ కనిపించడంతో క్షుద్రపూజలు జరిగినట్లుగా తేల్చుకున్నారు. అక్కడే ఉన్న మహిళను పట్టుకుని ఆమెకు దేహశుద్ధి చేశారు. అనంతరం పూజా సామాగ్రిని తోటలోకి తీసుకెళ్లి తగులబెట్టారు.

కాగా గ్రామస్తులు రావడానికి ముందే  ఆమె ఒక బాలుడి బొమ్మని చిత్రీకరించి, దాని ముందు గొయ్యి తవ్వి నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో క్షుద్రపూజలు చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read:అతీత శక్తుల కోసం...బెయిల్ మీద బయటకు వచ్చి.. సొంత చెల్లిని

అంతేకాకుండా ఓ దున్నపోతును బలి ఇచ్చినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. వారం రోజుల నుంచి గ్రామంలో చేతబడి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి నిద్రాహారాలు మాని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.