Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కు భారీ షాకిచ్చే యోచనలో బిజెపి... విజయవాడకు సీబీఐ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం షాకిచ్చేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిబిఐని విజయవాడలో మొహరించే ఏర్పాట్లు  చేస్తున్నట్లు  తెలుస్తోంది. 

BJP Shock to AP  CM YS Jagan
Author
Amaravathi, First Published Dec 12, 2019, 9:49 PM IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రంలో అధికార బీజేపీ భారీ షాక్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. విజయవాడ, గుంటూరులో వీలైనంత త్వరగా సీబీఐ కోర్టును ప్రారంభించాలని బీజేపీ నేతలు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. ఇందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. జగన్ కు చెక్ పెట్టేందుకే బిజెపి ఈ ఎత్తుగడ  వేస్తున్నట్లు సమాచారం. 

ఏపీ సీఎం జగన్ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు గతంలో హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. అందుకు సీబీఐ కోర్టు నో చెప్పింది.దీని మీద జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.

అయితే తాజాగా విజయవాడకు సీబీఐ కోర్టును కేటాయించాలని కోరుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో పలువురు బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిశారు. 

read more షోకాజ్ నోటీస్: పవన్ కల్యాణ్ మీద ఎమ్మెల్యే రాపాక తిరుగుబాటు

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విజయవాడకు సీబీఐ కోర్టును కేటాయించారని  అది ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు. వీలైనంత త్వరగా సీబీఐ కోర్టును విజయవాడ - గుంటూరులో ప్రారంభించాలని ఆ లేఖలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు

.సీఎం స్థానంలో ఉండి కోర్టు మెట్లు ఎక్కడం అనేది జగన్ మోహన్ రెడ్డి అపప్రదగా మారుతుందని వైసీపీ వర్గాల అభిప్రాయం. అందుకే కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారని చెబుతున్నారు. 

అదే సమయంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని... పరిపాలనా పరంగా కూడా ప్రోటోకాల్, ఇతర ఇబ్బందులు వస్తాయని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.ఆర్థికంగా కూడా ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. ఇవన్నీ ఆలోచించి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని కోరారు. 

read more ముగిసిన ఆనం పంచాయతీ: జగన్‌ను కలిసి వివరణ, షోకాజ్ నోటీసు లేనట్లే..?

అయితే సీబీఐ కోర్టు విజయవాడ - గుంటూరులో ఏర్పాటు చేస్తే.. ఏపీకి సంబంధించిన కేసులు ఆ రాష్ట్రానికి బదిలీ అవుతాయి. అప్పుడు విజయవాడలోనే కోర్టు ఉంది కాబట్టి... జగన్ పిటిషన్‌లో పేర్కొన్న మరోసారి చెప్పడానికి ఆస్కారం ఉండబోదని ప్రతిపక్షాలు చెప్పడానికి అవకాశం ఉంది. కానీ బీజేపీ నేతలు అందించిన లేఖ మీద కేంద్రం ఎలా స్పందిస్తుందనేది చూడాలి

.వీటితోపాటు ఏపీలో పలు ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ఆ లేఖలో నేతలు కోరారు. రాష్ట్రంలో మానహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, గత ఐదేళ్లలో ఎన్నో లాకప్ డెత్‌లు జరిగాయని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వంలో కూడా పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని ఆరోపించారు. ఏపీలో మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios