కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీని హర్యానా సీఎం మనోహరిలాల్ ఖట్టర్ తీవ్ర పదజాలంతో విమర్శించడాన్ని ఆంధ్ర ప్రదేశ్  కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి తప్పుబట్టారు. సోనియాకు జరిగిన అవమానానికి నిరసనగా సోమవారం ఉదయం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో రమణి పాల్గొన్నారు. 

ఈ నిరసన కార్యక్రమం రమణి కుమారి ఆధ్వర్యంలోనే జరిగింది. హర్యాన ఎన్నికల ప్రచారంలో భాగంగా మనోహరిలాల్ ఖట్టర్ మాట్లాడుతూ...  2019 లో జరిగిన ఎన్నికల్లో ఓడిన తర్వాత రాహుల్ గాంధీ మూడు నెలలపాటు దేశమంతా తిరిగి మళ్లీ సోనియా గాంధీకే అధ్యక్ష పదవిని ఇచ్చార ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు.  

 ఓ రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగా వున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగతని రమణి అన్నారు. రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీని సోనియా  2004 నుంచి  2014 వరకు నడిపించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి మీద తప్పుడు వాఖ్యలు చేయడం తగదన్నారు.

  దేశంలో బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళలకు గౌరవం, రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదని అందుకు సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలని రమణి డిమాండ్ చేశారు.