అమరావతి: రాష్ట్రంలో భారీగా నెలకొన్న ఇసుక కొరతను తగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ఎపి గ‌నుల శాఖా కార్య‌ద‌ర్శి రాంగోపాల్ వెల్లడించారు. ఇసుక కొరత,తవ్వకాలు తదితర అంశాలపై గనుల శాఖ ఆద్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఆ  శాఖ కార్యదర్శి మీడియాకు వివరించారు. 

మరో వారంరోజుల్లో ఇసుక స‌మ‌స్య‌ల‌ను అదిగ‌మిస్తామని ఆయన అన్నారు. కృష్ణా, గోదావ‌రి న‌దుల్లో ఇప్ప‌టికి భారీగా వరద నీరు వచచ్చి చేరుతోందని... దీని వ‌ల‌న ఇసుక రిచ్ ల‌ను ఓపెన్ చేయ‌లేక‌పోతున్నామని అన్నారు. 

ఇకపై ఇసుక త‌వ్వ‌కాల భాద్య‌త‌లు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్లకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. వ‌ర‌ద‌ల వ‌ల‌న మంచే కొద్దిగా ఆలస్యమైనా మంచే జ‌రిగిందన్నారు. వరద నీటితో పాటు భారీ స్థాయిలో ఇసుక వ‌చ్చి చేరింది.  

కేవలం ప‌ది రోజుల్లోనే ఇసుక తవ్వకం సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. రోజుకు ల‌క్ష మెట్రిక్ ట‌న్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ప్ర‌తి ఏడాది 2కోట్ల మెట్రిక్ ట‌న్నులు ఇసుక అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నావేస్తున్నామని అన్నారు.

ఇప్పుడు ప్ర‌తి రోజుల రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ట‌న్నులు ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. ఎంత ఇసుక ఉంటే అంతే అన్ లైన్ లో కోనుగోలుకు అనుమ‌తి ఇస్తున్నామని పేర్కొన్నారు. వ‌ర‌ద‌లు త‌గ్గిన వెంట‌నే 150 రిచ్ ల‌లో ఇసుక త‌వ్వకాలు జ‌రుపుతామని ఆయన వెల్లడించారు.