Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం... పరిస్థితి ఎలా వుందంటే: టీచర్ల ఆవేదన

జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలన్ని నిర్ణయంపై ఎస్జీటి టీచర్లు స్పందించారు. 

ap government school teacher reacts on english medium
Author
Amaravathi, First Published Dec 8, 2019, 7:07 PM IST

అమరావతి: విద్యావ్యవస్థలో అత్యధికంగా కష్టపడుతున్నది తామేనని... అయినప్పటికి విద్యావ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా ముందుగా బలయ్యేది తామేనని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల(ఎస్‌జిటి) ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలకుల అనాలోచిత, అహంకారం ధోరణితో ప్రతిసారి తామే బలవుతున్నామంటూ ఆరోపించారు.

తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... సమానత్వపు హక్కులను కాలరాస్తూ అర్హత ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇలా జరిగిన అక్రమ ప్రమోషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వ పాఠశాలను సంస్కరించకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారవుందని అన్నారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించడానికి ముందే పాఠశాలల సంస్కరణలు జరగాలన్నారు. 

read more కుప్పంలో ఏనుగుల గుంపు బీభత్సం... అన్నదాతల ఆందోళన

రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రాథమిక పాఠశాలన్నింటిని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అందుకోసం గెజిటెడ్ హోదా ప్రధానోపాధ్యాయున్ని నియమించాలని సూచించారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరగాలంటే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు.ఇది విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కని...దీన్నే తాము కోరుతున్నామని అన్నారు. కేవలం ఎస్. జి. టి టీచర్ల ద్వారా మాత్రమే ప్రాథమిక విద్యారంగానికి న్యాయం చేకూరుతుందని పేర్కొన్నారు.  

read more వైఎస్ వివేకా హత్యపై అనుమానాలు... జగన్ ను నిలదీస్తూ కన్నా లేఖ


 

Follow Us:
Download App:
  • android
  • ios