అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమ  పరిధిలోని అన్ని ఆలయాలకు పాలకమండళ్లను ఏర్పాటుచేసేందుకు సిద్దమైంది.ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 

రాష్ట్రవ్యాప్తంగా వున్న 448 ఆలయాల పాలకమండళ్ల ఏర్పాటుకు సంబంధించి ఒకేసారి  నోటిఫికేషన్ జారీ చేసింది. ఆలయ ఆదాయాన్ని బట్టి వేరువేరు కేటగిరీల్లో నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 

రూ. 25 లక్షల లోపు ఆదాయం ఉన్న 1388 ఆలయాలకు ,కోటిలోపు ఆదాయం ఉన్న 60 ఆలయాలకు వేరువేరుగా నోటిఫికేషన్ లు జారీ అయ్యాయి. రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు ఏడుగురు,కోటి లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు 9 మంది సభ్యులతో పాలకమండలిని ఏర్పాటుచేసుకునే వెసులుబాటు కల్పించింది. 

ప్రతి ట్రస్ట్ బోర్డులోను 50 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించాలన్న నిబంధనను విధించారు. అలాగే ప్రతి బోర్డులోను 50 శాతం పదవులు మహిళలకు కేటాయించేలా  నిబందనలు రూపొందించారు.