విశాఖపట్నం: అండమాన్ నుండి  ఢిల్లీ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విశాఖ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 

ఎయిర్ ఇండియా కు చెందిన 488 నెంబర్ గల విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా విశాఖలో నిలిపినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలోని 90 మంది ప్రయాణికులకు విశాఖలో వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంస్ధ తెలిపింది. విమానంలోని సాంకేతిక లోపాన్ని సరిచేసేవరకు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. 

read more  వైసిపి ఎంపీలతో జగన్ భేటీ... పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహమిదే

విమానంలో సాంకేతిక లోపాన్ని పైలెట్ ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదకర సంఘటనలు లేకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.