గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో గ్రామ/వార్డు సచివాలయాల కార్యక్రమం జరిగింది. పట్టణంలోని 25వ వార్డు, పెద్ద తుంబలం గ్రామంలోని గ్రామ/వార్డు సచివాలయాలను ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగనన్న  ప్రభుత్వం తమ నియోజకవర్గంలో 1200 వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు.

మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆర్థికంగా పురోగతి సాధించేలా పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ప్రజల వద్దకే పాలన అనే విధంగా అప్పటినుండి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయని విధంగా నిరుద్యోగులకు అవకాశం కల్పించిందని సాయిప్రసాద్ గుర్తు చేశారు.

అర్హులందరికీ పార్టీలకు అతీతంగా నవరత్న పథకాలు అందేలా చూసే బాధ్యత వాలంటీర్ల దే అన్నారు... అదేవిధంగా సంక్షేమ పథకాలు అందేలా ప్రతి ఒక్క వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

"