అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు కొనసాగాయి. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు కొనసాగిసాయి. తనిఖీలు చేపట్టిన కార్యాలయాలను తమ అదుపులోకి తీసుకుని రికార్డు పరిశీలన చేపట్టారు ఏసిబి అధికారులు. 

శ్రీకాకుళం జిల్లా భామిని ఎంపిడీవో నిమ్మల మాస 10,000 రూపాయిలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. విద్యా వాలంటీర్ ను రెగ్యులర్ చేస్తానని చెప్పి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నఏసిబి అదికారులు పట్టుకున్నారు. 

అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలోనే పలు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ప్రభుత్వం పంపిణీ చేసే ఇళ్ల స్థలాలు కొనుగోలులో అవకతవకల నేపథ్యంలోను ఈ దాడులు జరుగుతున్నట్లు తెలస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కాకుండా అదనపు రేటుకు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం ఏసిబి చేత దాడులు చేయిస్తోందని సమాచారం. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో గార, సంతకవిటి మండలంలలో ఏసిబి దాడులు జరుగుతున్నాయి. 

read more   ఏపీలో రెవిన్యూ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మార్వో ఆఫీసులపై ఏసిబి దాడులు చేపట్టింది. ఈ క్రమంలోనే తహసిల్దార్ చంద్రశేఖర్ నాయుడు కారులో రెండు లక్షల రూపాయలు, డిప్యూటీ తహసిల్దార్ కారులో లక్ష రూపాయలను గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనపరుచుకున్నారు. 

 విశాఖ జిల్లా కసింకోట ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ షకీలా భాను, డిఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో  చేపట్టారు. అయితే మండలంలోని మీసేవ సెంటర్ల కు సంబంధించి అనుమతులు విషయంలో అందిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించామని ఏసీబీ అధికారులు తెలియజేశారు. అనంతరం కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం  తెలియాల్సి ఉంది.

గుంటూరు జిల్లా రాజుపాలెం ఎమ్మార్వో కార్యాలయంలోనూ ఏసీబీ రైడ్స్ జరిగాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు ఎమ్మార్వో కార్యాలయంలోనూ, విజయనగరం జిల్లాలోని బలిజపేట ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ సోదాలు చేపట్టింది.