కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు  బంటిమెట్టలోని స్కూల్ ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి మొహిద్దీన్ మోదీన్ అనే వ్యక్తి సైకిల్‌పై తీసుకెళ్లాడు.

అనంతరం సాయంత్రం తీసుకొచ్చి అదే ప్రాంతంలో వదిలాడు. చిన్నారి శరీరంపై గాయాలు ఉండటంతో స్థానికులు ఆమె తల్లీదండ్రులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పేరెంట్స్ తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని నిర్దారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వీరితో పాటు స్థానికంగా ఉన్న భజరంగ్ దళ్ కార్యకర్తలు స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని ఆందోళన నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా స్థానికంగా ఈ సంఘటన సంచలనం కలిగించింది. 

Also Read:

అమెరికా రాయబారి కార్యాలయంలో.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

కాఫీలో మత్తు మందు కలిపి రేప్ చేశాడు, 12 ఏళ్లుగా...: రఘునందన్ రావుపై మహిళ ఆరోపణ

పెళ్లిపై నిర్ణయం చెబుతానని పిలిచి: యువతిపై ప్రియుడి తండ్రి అత్యాచారం