టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్ అని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నారు. సాధారణంగా... కోహ్లీ, స్మిత్ లలో ఎవరు గొప్ప క్రికెటర్ అనే విషయంపై ఎక్కువ శాతం చర్చలు జరుగుతూ ఉంటాయి. కొందరు కోహ్లీ గొప్ప అంటూ... ఇంకొందరు స్మిత్ గొప్ప అని చెబుతుంటారు. అయితే... తాజాగా ఈ విషయంపై స్మిత్ స్పందించాడు.

తనకంటే కూడా కోహ్లీ గొప్ప క్రికెటర్ అంటూ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. కోహ్లీ ఓ అద్భుతమైన క్రికెటర్ అని... భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడంటూ స్మిత్.. కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ ఎంత గొప్ప క్రికెటరో అతని రికార్డులే చెబుతున్నాయన్నాడు. ఏ ఫార్మాట్ లోనైనా కోహ్లీ అదగొడతాడని.. అసాధారణ ఆటగాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. టెస్టు క్రికెట్ లో టీమిండియాను నెంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత విరాట్ కే దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా కోహ్లీ ఫిట్ నెస్ కూడా అమోఘం అంటూ ప్రశంసించాడు.

Also Read ధోనీ రిటైర్మెంట్ పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు...

అనంతరం టీ20 ప్రపంచకప్ గురించి కూడా స్మిత్ స్పందించాడు. టీ20ల్లో రాణించడం కోసం ఎలాంటి శిక్ష తీసుకోవడం లేదని చెప్పారు. ఎక్కువ క్రికెట్ ఆడితే సరైన శైలి పొందుతానని చెప్పాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్ జట్టులో ఉండటానికి ఎంతో ఇష్టడపతాను అని చెప్పారు. 2015 ప్రపంచకప్ లో తాను పాల్గొన్నట్లు చెప్పాడు. ఆ ఆరు వారాల్లో ప్రతి నిమిషాన్ని తాను ఆస్వాదించానని చెప్పాడు. ఈ సంవత్సరం తమ దేశంలో జరిగే టీ20 ప్రపంచకప్ లో తమ జట్టే కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.