వాలంటైన్స్ డేను పురస్కరించుకుని సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం తన తొలి ప్రేమను పంచుకున్నారు. ఫస్ట్ లవ్ అంటూ ట్వీట్ చేశారు.

Also Read:హనుమ 'వీర' విహారీ: ఓపెనింగ్ పరీక్షలో ముగ్గురూ విఫలం

ఇది తన భార్య అంజిలి గురించి అని పొరపాటు పడొద్దు. తాను నెట్స్‌లో క్రికెట్ సాధన చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బుష్‌ఫైర్ ఛారిటీ మ్యాచ్ సందర్భంగా పాంటింగ్ xi జట్టుకు కోచ్‌‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ మ్యాచ్ బ్రేక్ టైంలో సచిన్ బ్యాట్ పట్టుకున్నారు. ఎల్లిసే పెర్రీ బౌలింగ్‌లో ఒక ఓవర్ పాటు బ్యాటింగ్ చేసి అభిమానులను అలరించాడు. మరోవైపు భారత్‌లో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ పేరిట మార్చి 7 నుంచి 22 వరకు నిర్వహించే ఐదు దేశాల టోర్నీలో భారత జట్టుకు సచిన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

Also Read:‘నీ అదృష్టం బాగుంది’... సచిన్ ఫోటోపై గంగూలీ షాకింగ్ కామెంట్

ఈ సిరీస్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాల మాజీ దిగ్గజాలు ఆడనున్నారు. వీరిలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, లారా, శివనారాయణ్ చందర్‌పాల్, బ్రెట్‌లీ, బ్రాడ్ హోడ్జ్, జాంటీ రోడ్స్, మురళీ ధరన్, దిల్షాన్, మెండిస్ వున్నారు.