T20 worldcup2021 India vs Pakistan: దాయాదుల పోరులో పాక్ దే విజయం.. భారత్ కు జీర్ణించుకోలేని ఓటమి

T20 worldcup 2021 India vs Pakistan match Live updates and analysis in Telugu

T20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో ఆడుతోంది. ఇరుదేశాల మధ్య రెండేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇండో, పాక్ టీ20 ఫైట్‌కి బీభత్సమైన క్రేజ్ వచ్చింది... 

11:00 PM IST

నయా చరిత సృష్టించిన పాక్.. భారత్ పై సూపర్ విక్టరీ

152 పరుగుల లక్ష్య ఛేదనతో  బ్యాటింగ్ కు దిగిన పాక్.. మరో 12 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఆ జట్టు ఓపెనర్లే విజయాన్ని ఖరారు చేశారు. బాబర్ ఆజమ్ (68), మహ్మద్ రిజ్వాన్ (79) పరుగులతో చెలరేగారు. భారత బౌలర్లు అట్టర్ ప్లాఫ్ అయ్యారు.

10:46 PM IST

ఇక ఆశలు వదులుకోవడమేనా..?

16 వ ఓవర్ ముగిసేసరికి పాక్ ఓపెనర్లు 128 పరుగులు చేశారు. పాక్ విజయానికి 4 ఓవర్లలో పాతిక పరుగులు అవసరముంది. ఇక భారత్ అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందేనా..?

10:41 PM IST

విజయానికి 32 పరుగులే..

పాక్ విజయానికి మరో 32 పరుగులే బాకీ ఉంది. ఓపెనర్లిద్దరూ క్రీజులో పాతుకుపోయారు. 15 ఓవర్లు ముగిసేసరికి పాక్ 121 పరుగులు చేసింది. బుమ్రా 9 పరుగులిచ్చాడు. రిజ్వాన్ (56), బాబర్ (62) క్రీజులో ఉన్నారు. 

10:37 PM IST

14 ఓవర్లకు 112/0

14 ఓవర్లు ముగిసేసరికి పాక్ 112 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు.  రిజ్వాన్ (48), బాబర్ (61) క్రీజులో పాతుకుపోయారు. 

10:33 PM IST

రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు.. దూకుడు పెంచిన పాకిస్థాన్

పాకిస్థాన్  ఓపెనర్లు దూకుడు పెంచారు. వరుణ్ చక్రవర్తి  వేసిన 13వ ఓవర్ లో మహ్మద్ రిజ్వాన్, బాబర్ చెరో సిక్సర్ బాదారు. ఈ ఓవర్లో 16 పరుగులొచ్చాయి.  బాబర్ (52), రిజ్వాన్ (46) క్రీజులో ఉన్నారు.  పాక్ విజయానికి ఇంకా 42 బంతుల్లో 51 పరుగులు మాత్రమే కావాలి.  13 వ ఓవర్ ముగిసేసరికి పాక్ స్కోరు వికెట్ నష్టపోకుండా 101.

10:28 PM IST

తేలిపోతున్న భారత బౌలర్లు

12 వ ఓవర్ ముగిసేసరికి పాక్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 85 పరుగులుగా ఉంది. భారత బౌలర్లు తేలిపోతున్నారు. బాబర్ ఆజమ్ (44), రిజ్వాన్ (38) క్రీజులో ఉన్నారు.

10:19 PM IST

పది ఓవర్లకు పాక్ స్కోరు 71/0

పది ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 71/0.  పాక్ ఓపెనర్లుగా వచ్చిన బాబర్ ఆజమ్ (34), మహ్మద్ రిజ్వాన్ (35) నిలకడైన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే పాక్.. మరో 60 బంతుల్లో 81 పరుగులు చేయాలి. ఇంకా పది వికెట్లు చేతిలో ఉన్నాయి. 

10:09 PM IST

కరుగుతున్న లక్ష్యం.. కానరాని వికెట్

మ్యాచ్ మొదలై 9 ఓవర్లైనా భారత్ కు ఇంకా వికెట్ దక్కలేదు. మరోవైపు ఛేదించాల్సిన లక్ష్యం కరిగిపోతున్నది. 9 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. జడేజా వేసిన ఈ ఓవర్ లో పది పరుగులొచ్చాయి. బాబర్ సిక్సర్ బాదాడు. 

10:09 PM IST

50 దాటిన పాక్..

8 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 50 పరుగులు దాటింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్ లో ఆరు పరుగులొచ్చాయి. బాబర్ (20), రిజ్వాన్ (30)  క్రీజులో కుదురుకుంటున్నారు. విజయానికి పాక్ ఇంకా 72 బంతుల్లో 100 పరుగులు చేయాలి. ప్రస్తుతం 52/0.

10:04 PM IST

7 ఓవర్లకు పాక్ 46/0

ఏడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 46/0. బాబర్ (18), రిజ్వాన్ (27)  క్రీజులో ఉన్నారు. 

9:54 PM IST

చెరో ఫోర్ బాదిన బాబర్, రిజ్వాన్.. నిలకడగా పాక్ బ్యాటింగ్

మహ్మద్ షమీ వేసిన ఐదో ఓవర్లో పాక్ కెప్టెన్  బాబర్ ఆజమ్, రిజ్వాన్ తలో ఫోర్ బాదారు. ఫలితంగా 5 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 35/0 గా ఉంది.  రిజ్వాన్ (21), బాబర్ (14) క్రీజులో ఉన్నారు.  పాకిస్థాన్ ఓపెనరర్లు నిలకడగా ఆడుతున్నారు.

9:44 PM IST

నాలుగో ఓవర్లో రెండే పరుగులు

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కు వచ్చాడు. ఈ ఓవర్లో రెండు పరుగులే  వచ్చాయి.  తొలి ఓవర్ లో రెచ్చిపోయిన  రిజ్వాన్, బాబర్ లు నిలకడగా ఆడుతున్నారు.  4 ఓవర్లకు పాక్ 24/0. 

9:44 PM IST

3 ఓవర్లకు పాక్ స్కోరు 22/0

మూడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్  వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు  చేసింది. జస్ప్రీత్  బుమ్రా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. బాబర్ (8), రిజ్వాన్ (14) ఆడుతున్నారు. 

9:42 PM IST

రెండో ఓవర్లో 8 పరుగులు

మహ్మద్ షమీ వేసిన రెండో ఓవర్ లో ఎనిమిది పరుగులొచ్చాయి. బాబర్ ఆజమ్ (5) ఖాతా తెరిచాడు. మహ్మద్ రిజ్వాన్ (13) క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు పాక్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 18 పరుగులు. 

9:33 PM IST

ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. తొలి ఓవర్లో10/0

భారత్ నిర్దేశించిన  152 పరుగుల విజయలక్ష్యాన్ని సాధించడానికి పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది.  ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (0), మహ్మద్ రిజ్వాన్ (10) బ్యాటింగ్ కు దిగారు. తొలి ఓవర్ లోనే రిజ్వాన్ ఫోర్, సిక్సర్ తో 10 పరుగులు రాబట్టాడు. మొదటి ఓవర్ లో భువనేశ్వర్ పది పరుగులిచ్చాడు. 

9:20 PM IST

20 ఓవర్లకు భారత్ 151/7.. పాక్ విజయలక్ష్యం 152

పాకిస్థాన్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఆఖరు ఓవర్లో స్కోరును  పెంచే యత్నంలో హార్ధిక్ పాండ్యా (11) ఔట్ అయ్యాడు. పాకిస్థాన్ విజయం లక్ష్యం 152 పరుగులు. 

9:09 PM IST

19 ఓవర్లకు టీమిండియా స్కోరు144 /6

19 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 144/6. హార్ధిక్ పాండ్యా (9), భువనేశ్వర్ కుమార్ (1) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్ లో రెండు ఫోర్లు, నోబ్ తో పాటు ఓవర్ త్రో రూపంలో 16 పరుగులొచ్చాయి. 

9:09 PM IST

కోహ్లి ఔట్

విరాట్ కోహ్లి (57) ఔట్. షాహీన్ అఫ్రిది వేసిన 18.3 ఓవర్ లో కీపర్ కు  క్యాచ్ ఇచ్చిన విరాట్. షాహీన్ కు మూడు వికెట్లు.  

9:00 PM IST

కోహ్లి హాఫ్ సెంచరీ.. జడ్డూ ఔట్.. 18 ఓవర్లకు టీమిండియా 127/5

భారత సారథి కోహ్లి (57) హాఫ్ సెంచరీ సాధించాడు. హసన్ అలీ వేసిన 18వ ఓవర్లో కోహ్లి, రవీంద్ర జడేజా చెరో ఫోర్ బాదారు. కానీ ఐదో బంతికి భారీ షాట్ కు యత్నించిన జడ్డూ (13)..  క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.  అతడి స్థానంలో హార్ధిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్ లో 13 పరుగులొచ్చాయి. 

8:59 PM IST

హాఫ్ సెంచరీకి చేరువలో కోహ్లి..

సహచరులంతా అలా వచ్చి ఇలా వెళ్తున్న చోట భారత సారథి నిలకడగా ఆడుతున్నాడు. 44 బంతులాడిన కోహ్లి.. హాఫ్ సెంచరీకి మరో రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక 17 వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 4 వికెట్లకు 114.  రవీంద్ర జడేజా (9) క్రీజులో ఉన్నాడు. 

8:54 PM IST

కోహ్లి రెండు ఫోర్లు.. 16 వ ఓవర్లో పది పరుగులు

16 వ ఓవర్ లో భారత సారథి కోహ్లి (46) బ్యాటుకు పనిచెప్పాడు. హసన్ అలీ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. భారత్ స్కోరు 110/4

8:50 PM IST

15 వ ఓవర్లో నాలుగు పరుగులే..

15 వ ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి.  పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. 15 ఓవర్లకు భారత్ స్కోరు 100/4. ఇంకా ఐదే ఓవర్లు మిగిలున్నాయి. విరాట్ కోహ్లి (37), రవీంద్ర జడేజా (6) క్రీజులో ఉన్నా ఇంకా బ్యాట్ ఝుళిపించడం లేదు.

8:45 PM IST

14 వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 96/4

14వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా 96/4 గా ఉంది. విరాట్ కోహ్లి (35), రవీంద్ర జడేజా (4) పరుగులతో క్రీజులో ఉన్నారు. రౌఫ్ వేసిన ఈ ఓవర్లో పది పరుగులొచ్చాయి.

8:40 PM IST

రిషభ్ పంత్ ఔట్

12 వ ఓవర్ లో రెండు సిక్సర్లు బాదిన రిషభ్ పంత్ (39).. ఆ తర్వాతి ఓవర్లో నిష్క్రమించాడు. స్పిన్నర్ షాదాబ్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంత్ స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు.
 
8:34 PM IST

రిషభ్ పంత్ రెండు సిక్సర్లు.. జోరు పెంచిన టీమిండియా

12 వ ఓవర్లో  టీమిండియాకు 15 పరుగులొచ్చాయి. ప్రస్తుతం భారత్ 81/3గా ఉంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (37) ఈ ఓవర్లో రెండు  బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు. మరో ఎండ్ లో కోహ్లి (28) అతడికి సాయం అందిస్తున్నాడు.  

8:30 PM IST

11 వ ఓవర్లో ఆరు పరుగులు

11 వ ఓవర్ ముగిసేసరికి భారత్ 66/3 గా ఉంది. సూర్యకుమార్ ఔటయ్యాక వచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (22) ఆచితూచి  ఆడుతున్నాడు. కోహ్లి (28) అండతో స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్నాడు. 

8:22 PM IST

కుదురుకుంటున్న భారత్.. పది ఓవర్లలో 60/3

పాకిస్థాన్ తో కీలక మ్యాచ్ లో భారత్ నిదానంగా ఆడుతున్నది. పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 60/3గా ఉంది. కెప్టెన్ కోహ్లి (26), రిషభ్ పంత్ (19) క్రీజులో కుదరుకుంటున్నారు. 

8:13 PM IST

7 ఓవర్లకు భారత్ 43/3

పాక్ తో మ్యాచ్ లో భారత్ తడబడుతున్నది. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 43/3  గా ఉంది. రిషభ్ పంత్ (6), కోహ్లి (21) పోరాడుతున్నారు. పాకిస్తాన్ బౌలర్లు జోరుమీదున్నారు.

8:05 PM IST

మూడో వికెట్ కోల్పోయిన భారత్

భారత్ మూడో వికెట్ కోల్పోయింది. హసన్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ (11) కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ స్కోరు 31-3 గా ఉంది.

7:51 PM IST

ఐదు ఓవర్లకు టీమిండియా స్కోరు30/2

పాకిస్థాన్ తో జరుగుతున్న పోరులో టీమిండియా ఎదురీదుతున్నది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ 5 ఓవర్లు ముగిసేసరికి 2  వికెట్లు కోల్పోయి  పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (15), సూర్యకుమార్ యుదవ్ (11) క్రీజులో ఉన్నారు 

7:47 PM IST

3 ఓవర్లు ముగిసేసరికి భారత్ 14/2

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 14 పరుగులు  చేసింది. షాహీన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్ ఆఖరుబంతిని  కెఎల్ రాహుల్ సిక్సర్ గా మలిచాడు. 

7:40 PM IST

కెఎల్ రాహుల్ ఔట్.. కష్టాల్లో భారత్

భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్ (3) ఔటయ్యాడు. షాహీన్ అఫ్రిది రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. 

7:40 PM IST

రెండో ఓవర్ లో నాలుగు పరుగులు

ఇమాద్ వాసిమ్ వేసిన రెండో ఓవర్ లో నాలుగు పరుగులొచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 6/1 గా ఉంది. కెఎల్ రాహుల్ (3), విరాట్ (3) ఆడుతున్నారు. 

7:29 PM IST

రోహిత్ శర్మ ఔట్.. భారత్ కు తొలి షాక్

టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ కు బిగ్ షాక్. తొలి ఓవర్ లోనే  భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (0) పరుగులేమీ చేయకుండానే షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 2/1 గా ఉంది. 

7:10 PM IST

పాకిస్తాన్ జట్టు...

పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ ఆలీ, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, హసన్ ఆలీ, హాసీన్ రౌఫ్, షాహీన్ ఆఫ్రిదీ

7:08 PM IST

భారత జట్టు ఇదే...

భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్

7:02 PM IST

టాస్ గెలిచిన పాకిస్తాన్...

ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది...

6:57 PM IST

భారత్, పాక్‌ మ్యాచులంటేనే...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్, పాక్ మ్యాచుల ఫలితాలు...

6:57 PM IST

టీమిండియా 5- 0 పాకిస్తాన్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుకి పాకిస్తాన్‌పై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఐదుసార్లు పాక్‌తో తలబడిన భారత జట్టు, ఐదుసార్లు విజయాన్ని అందుకుంది. 

6:46 PM IST

నిన్నటి మ్యాచ్ ఎఫెక్ట్...

ఇదే స్టేడియంలో నిన్న వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో విండీస్ 55 పరుగులకే ఆలౌట్ కావడం, లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ కూడా నాలుగు వికెట్లు కోల్పోవడం ఫ్యాన్స్‌ని భయపెడుతోంది...

6:42 PM IST

మెంటర్‌గా మాహీ...

గత ఆరు సీజన్లలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ టోర్నీలో మెంటర్‌గా అవతారం ఎత్తాడు. మెంటర్‌గా మహీకి పాక్‌తో మ్యాచే మొదటిది కానుంది...

6:39 PM IST

రోహిత్‌కి ఏడోది...

విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ రికార్డు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌పై ఏమంత సరిగా లేదు. 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి ఆడుతున్న రోహిత్, తన కెరీర్‌లో ఏడో టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆడుతున్నాడు... 2007 నుంచి ఇప్పటిదాకా అన్ని టీ20 వరల్డ్‌కప్స్ ఆడుతున్న మొట్టమొదటి క్రికెటర్ రోహిత్ శర్మే...

6:38 PM IST

బౌలింగ్‌లోనూ భళా...

2012 టీ20 వరల్డ్‌కప్‌లో  78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా ఈ మ్యాచ్‌లో బౌలింగ్ కూడా చేసిన విరాట్ కోహ్లీ, 3 ఓవర్లలో 21 పరుగులిచ్చి పాక్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌ను బౌల్డ్ చేశాడు...

6:37 PM IST

పాక్‌ అంటేనే స్పెషల్...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా అవుట్ కాలేదు.  2012 టీ20 వరల్డ్‌కప్‌లో తన మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

6:36 PM IST

క్రేజ్ కా బాప్...

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా 243+ మిలియన్ల మంది లైవ్ వీక్షించడం విశేషం. కేవలం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల్లోనే 50 మిలయన్లకు పైగా వీక్షించడం ఓ రికార్డుగా ఉంది. ఈసారి అంతకుమించిన వ్యూయర్‌షిప్ వస్తుందని అంచనా...

6:35 PM IST

కెప్టెన్స్ స్పెషల్...

విరాట్‌ కోహ్లీకి కెప్టెన్‌గా మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్, ఇదే చివరిది కూడా.. గత రెండు వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీపై ఈసారి భారీ అంచనాలున్నాయి...

11:19 PM IST:

152 పరుగుల లక్ష్య ఛేదనతో  బ్యాటింగ్ కు దిగిన పాక్.. మరో 12 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఆ జట్టు ఓపెనర్లే విజయాన్ని ఖరారు చేశారు. బాబర్ ఆజమ్ (68), మహ్మద్ రిజ్వాన్ (79) పరుగులతో చెలరేగారు. భారత బౌలర్లు అట్టర్ ప్లాఫ్ అయ్యారు.

10:47 PM IST:

16 వ ఓవర్ ముగిసేసరికి పాక్ ఓపెనర్లు 128 పరుగులు చేశారు. పాక్ విజయానికి 4 ఓవర్లలో పాతిక పరుగులు అవసరముంది. ఇక భారత్ అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందేనా..?

10:42 PM IST:

పాక్ విజయానికి మరో 32 పరుగులే బాకీ ఉంది. ఓపెనర్లిద్దరూ క్రీజులో పాతుకుపోయారు. 15 ఓవర్లు ముగిసేసరికి పాక్ 121 పరుగులు చేసింది. బుమ్రా 9 పరుగులిచ్చాడు. రిజ్వాన్ (56), బాబర్ (62) క్రీజులో ఉన్నారు. 

10:37 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి పాక్ 112 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు.  రిజ్వాన్ (48), బాబర్ (61) క్రీజులో పాతుకుపోయారు. 

10:33 PM IST:

పాకిస్థాన్  ఓపెనర్లు దూకుడు పెంచారు. వరుణ్ చక్రవర్తి  వేసిన 13వ ఓవర్ లో మహ్మద్ రిజ్వాన్, బాబర్ చెరో సిక్సర్ బాదారు. ఈ ఓవర్లో 16 పరుగులొచ్చాయి.  బాబర్ (52), రిజ్వాన్ (46) క్రీజులో ఉన్నారు.  పాక్ విజయానికి ఇంకా 42 బంతుల్లో 51 పరుగులు మాత్రమే కావాలి.  13 వ ఓవర్ ముగిసేసరికి పాక్ స్కోరు వికెట్ నష్టపోకుండా 101.

10:28 PM IST:

12 వ ఓవర్ ముగిసేసరికి పాక్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 85 పరుగులుగా ఉంది. భారత బౌలర్లు తేలిపోతున్నారు. బాబర్ ఆజమ్ (44), రిజ్వాన్ (38) క్రీజులో ఉన్నారు.

10:20 PM IST:

పది ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 71/0.  పాక్ ఓపెనర్లుగా వచ్చిన బాబర్ ఆజమ్ (34), మహ్మద్ రిజ్వాన్ (35) నిలకడైన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే పాక్.. మరో 60 బంతుల్లో 81 పరుగులు చేయాలి. ఇంకా పది వికెట్లు చేతిలో ఉన్నాయి. 

10:13 PM IST:

మ్యాచ్ మొదలై 9 ఓవర్లైనా భారత్ కు ఇంకా వికెట్ దక్కలేదు. మరోవైపు ఛేదించాల్సిన లక్ష్యం కరిగిపోతున్నది. 9 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. జడేజా వేసిన ఈ ఓవర్ లో పది పరుగులొచ్చాయి. బాబర్ సిక్సర్ బాదాడు. 

10:09 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 50 పరుగులు దాటింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్ లో ఆరు పరుగులొచ్చాయి. బాబర్ (20), రిజ్వాన్ (30)  క్రీజులో కుదురుకుంటున్నారు. విజయానికి పాక్ ఇంకా 72 బంతుల్లో 100 పరుగులు చేయాలి. ప్రస్తుతం 52/0.

10:05 PM IST:

ఏడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 46/0. బాబర్ (18), రిజ్వాన్ (27)  క్రీజులో ఉన్నారు. 

9:58 PM IST:

మహ్మద్ షమీ వేసిన ఐదో ఓవర్లో పాక్ కెప్టెన్  బాబర్ ఆజమ్, రిజ్వాన్ తలో ఫోర్ బాదారు. ఫలితంగా 5 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 35/0 గా ఉంది.  రిజ్వాన్ (21), బాబర్ (14) క్రీజులో ఉన్నారు.  పాకిస్థాన్ ఓపెనరర్లు నిలకడగా ఆడుతున్నారు.

9:52 PM IST:

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కు వచ్చాడు. ఈ ఓవర్లో రెండు పరుగులే  వచ్చాయి.  తొలి ఓవర్ లో రెచ్చిపోయిన  రిజ్వాన్, బాబర్ లు నిలకడగా ఆడుతున్నారు.  4 ఓవర్లకు పాక్ 24/0. 

9:47 PM IST:

మూడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్  వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు  చేసింది. జస్ప్రీత్  బుమ్రా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. బాబర్ (8), రిజ్వాన్ (14) ఆడుతున్నారు. 

9:42 PM IST:

మహ్మద్ షమీ వేసిన రెండో ఓవర్ లో ఎనిమిది పరుగులొచ్చాయి. బాబర్ ఆజమ్ (5) ఖాతా తెరిచాడు. మహ్మద్ రిజ్వాన్ (13) క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు పాక్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 18 పరుగులు. 

9:37 PM IST:

భారత్ నిర్దేశించిన  152 పరుగుల విజయలక్ష్యాన్ని సాధించడానికి పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది.  ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (0), మహ్మద్ రిజ్వాన్ (10) బ్యాటింగ్ కు దిగారు. తొలి ఓవర్ లోనే రిజ్వాన్ ఫోర్, సిక్సర్ తో 10 పరుగులు రాబట్టాడు. మొదటి ఓవర్ లో భువనేశ్వర్ పది పరుగులిచ్చాడు. 

9:21 PM IST:

పాకిస్థాన్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఆఖరు ఓవర్లో స్కోరును  పెంచే యత్నంలో హార్ధిక్ పాండ్యా (11) ఔట్ అయ్యాడు. పాకిస్థాన్ విజయం లక్ష్యం 152 పరుగులు. 

9:14 PM IST:

19 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 144/6. హార్ధిక్ పాండ్యా (9), భువనేశ్వర్ కుమార్ (1) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్ లో రెండు ఫోర్లు, నోబ్ తో పాటు ఓవర్ త్రో రూపంలో 16 పరుగులొచ్చాయి. 

9:10 PM IST:

విరాట్ కోహ్లి (57) ఔట్. షాహీన్ అఫ్రిది వేసిన 18.3 ఓవర్ లో కీపర్ కు  క్యాచ్ ఇచ్చిన విరాట్. షాహీన్ కు మూడు వికెట్లు.  

9:06 PM IST:

భారత సారథి కోహ్లి (57) హాఫ్ సెంచరీ సాధించాడు. హసన్ అలీ వేసిన 18వ ఓవర్లో కోహ్లి, రవీంద్ర జడేజా చెరో ఫోర్ బాదారు. కానీ ఐదో బంతికి భారీ షాట్ కు యత్నించిన జడ్డూ (13)..  క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.  అతడి స్థానంలో హార్ధిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్ లో 13 పరుగులొచ్చాయి. 

8:59 PM IST:

సహచరులంతా అలా వచ్చి ఇలా వెళ్తున్న చోట భారత సారథి నిలకడగా ఆడుతున్నాడు. 44 బంతులాడిన కోహ్లి.. హాఫ్ సెంచరీకి మరో రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక 17 వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 4 వికెట్లకు 114.  రవీంద్ర జడేజా (9) క్రీజులో ఉన్నాడు. 

8:55 PM IST:

16 వ ఓవర్ లో భారత సారథి కోహ్లి (46) బ్యాటుకు పనిచెప్పాడు. హసన్ అలీ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. భారత్ స్కోరు 110/4

8:50 PM IST:

15 వ ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి.  పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. 15 ఓవర్లకు భారత్ స్కోరు 100/4. ఇంకా ఐదే ఓవర్లు మిగిలున్నాయి. విరాట్ కోహ్లి (37), రవీంద్ర జడేజా (6) క్రీజులో ఉన్నా ఇంకా బ్యాట్ ఝుళిపించడం లేదు.

8:45 PM IST:

14వ ఓవర్ ముగిసేసరికి టీమిండియా 96/4 గా ఉంది. విరాట్ కోహ్లి (35), రవీంద్ర జడేజా (4) పరుగులతో క్రీజులో ఉన్నారు. రౌఫ్ వేసిన ఈ ఓవర్లో పది పరుగులొచ్చాయి.

8:40 PM IST:

12 వ ఓవర్ లో రెండు సిక్సర్లు బాదిన రిషభ్ పంత్ (39).. ఆ తర్వాతి ఓవర్లో నిష్క్రమించాడు. స్పిన్నర్ షాదాబ్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంత్ స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు.
 
8:35 PM IST:

12 వ ఓవర్లో  టీమిండియాకు 15 పరుగులొచ్చాయి. ప్రస్తుతం భారత్ 81/3గా ఉంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (37) ఈ ఓవర్లో రెండు  బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు. మరో ఎండ్ లో కోహ్లి (28) అతడికి సాయం అందిస్తున్నాడు.  

8:30 PM IST:

11 వ ఓవర్ ముగిసేసరికి భారత్ 66/3 గా ఉంది. సూర్యకుమార్ ఔటయ్యాక వచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (22) ఆచితూచి  ఆడుతున్నాడు. కోహ్లి (28) అండతో స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్నాడు. 

8:24 PM IST:

పాకిస్థాన్ తో కీలక మ్యాచ్ లో భారత్ నిదానంగా ఆడుతున్నది. పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 60/3గా ఉంది. కెప్టెన్ కోహ్లి (26), రిషభ్ పంత్ (19) క్రీజులో కుదరుకుంటున్నారు. 

8:15 PM IST:

పాక్ తో మ్యాచ్ లో భారత్ తడబడుతున్నది. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 43/3  గా ఉంది. రిషభ్ పంత్ (6), కోహ్లి (21) పోరాడుతున్నారు. పాకిస్తాన్ బౌలర్లు జోరుమీదున్నారు.

8:05 PM IST:

భారత్ మూడో వికెట్ కోల్పోయింది. హసన్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ (11) కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ స్కోరు 31-3 గా ఉంది.

7:57 PM IST:

పాకిస్థాన్ తో జరుగుతున్న పోరులో టీమిండియా ఎదురీదుతున్నది. పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ 5 ఓవర్లు ముగిసేసరికి 2  వికెట్లు కోల్పోయి  పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (15), సూర్యకుమార్ యుదవ్ (11) క్రీజులో ఉన్నారు 

7:49 PM IST:

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 14 పరుగులు  చేసింది. షాహీన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్ ఆఖరుబంతిని  కెఎల్ రాహుల్ సిక్సర్ గా మలిచాడు. 

7:49 PM IST:

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 14 పరుగులు  చేసింది. షాహీన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్ ఆఖరుబంతిని  కెఎల్ రాహుల్ సిక్సర్ గా మలిచాడు. 

7:44 PM IST:

భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కెఎల్ రాహుల్ (3) ఔటయ్యాడు. షాహీన్ అఫ్రిది రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. 

7:42 PM IST:

ఇమాద్ వాసిమ్ వేసిన రెండో ఓవర్ లో నాలుగు పరుగులొచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 6/1 గా ఉంది. కెఎల్ రాహుల్ (3), విరాట్ (3) ఆడుతున్నారు. 

7:39 PM IST:

టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ కు బిగ్ షాక్. తొలి ఓవర్ లోనే  భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (0) పరుగులేమీ చేయకుండానే షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 2/1 గా ఉంది. 

7:11 PM IST:

పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ ఆలీ, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, హసన్ ఆలీ, హాసీన్ రౌఫ్, షాహీన్ ఆఫ్రిదీ

7:09 PM IST:

భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్

7:03 PM IST:

ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది...

6:58 PM IST:

టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్, పాక్ మ్యాచుల ఫలితాలు...

6:57 PM IST:

టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుకి పాకిస్తాన్‌పై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఐదుసార్లు పాక్‌తో తలబడిన భారత జట్టు, ఐదుసార్లు విజయాన్ని అందుకుంది. 

6:46 PM IST:

ఇదే స్టేడియంలో నిన్న వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో విండీస్ 55 పరుగులకే ఆలౌట్ కావడం, లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ కూడా నాలుగు వికెట్లు కోల్పోవడం ఫ్యాన్స్‌ని భయపెడుతోంది...

6:42 PM IST:

గత ఆరు సీజన్లలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ టోర్నీలో మెంటర్‌గా అవతారం ఎత్తాడు. మెంటర్‌గా మహీకి పాక్‌తో మ్యాచే మొదటిది కానుంది...

6:39 PM IST:

విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ రికార్డు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌పై ఏమంత సరిగా లేదు. 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి ఆడుతున్న రోహిత్, తన కెరీర్‌లో ఏడో టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆడుతున్నాడు... 2007 నుంచి ఇప్పటిదాకా అన్ని టీ20 వరల్డ్‌కప్స్ ఆడుతున్న మొట్టమొదటి క్రికెటర్ రోహిత్ శర్మే...

6:38 PM IST:

2012 టీ20 వరల్డ్‌కప్‌లో  78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా ఈ మ్యాచ్‌లో బౌలింగ్ కూడా చేసిన విరాట్ కోహ్లీ, 3 ఓవర్లలో 21 పరుగులిచ్చి పాక్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌ను బౌల్డ్ చేశాడు...

6:37 PM IST:

టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా అవుట్ కాలేదు.  2012 టీ20 వరల్డ్‌కప్‌లో తన మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

6:37 PM IST:

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా 243+ మిలియన్ల మంది లైవ్ వీక్షించడం విశేషం. కేవలం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల్లోనే 50 మిలయన్లకు పైగా వీక్షించడం ఓ రికార్డుగా ఉంది. ఈసారి అంతకుమించిన వ్యూయర్‌షిప్ వస్తుందని అంచనా...

6:36 PM IST: