Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్: స్టీవ్ వా కామెంట్ ఇదీ...

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆడమ్ జంపా చేతిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడమ్ జంపా చేతిలో అవుటైన తీరును స్టీవ్ వా విశ్లేషించాడు. విరాట్ కోహ్లీ ఆడమ్ జంపాకు గౌరవం ఇవ్వలేదని స్టీవ్ వా అన్నాడు.

Steve Waugh says Virat Kohli is not showing respect to Jampa
Author
Melbourne VIC, First Published Jan 16, 2020, 9:48 PM IST

మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుటైన తీరుపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా స్పందించాడు. విరాట్  కోహ్లీ అవుటైన తీరును ఆయన విశ్లేషించాడు. ఎక్కువ సార్లు జంపా చేతిలో అవుటైన కోహ్లీ అతని బౌలింగును ఆచితూచి ఆడాల్సిందని ఆయన అన్నాడు. 

విరాట్ కోహ్లీ జంపా బౌలింగులో దూకుడు ప్రదర్శించడమే చేసిన తప్పు అని ఆయన అన్నాడు. జంపాకు విరాట్ కోహ్లీ గౌరవం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడని స్టీవ్ వా అన్నాడు. జంపా కూడా ప్రధానమైన బౌలర్ అనే విషయాన్ని విరాట్ కోహ్లీ మరిచిపోయాడని ఆయన అన్నాడు. 

Also Read: సిక్స్ కొట్టిన విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్

జంపాను సమర్థంగా ఎదుర్కోవాలనే ఆలోచన కోహ్లీకి నిజంగా ఉంటే అలా చేసి ఉండేవాడు కాడని, ఆచితూచి ఆడేవాడని ఆయన అన్నాడు. జంపా బౌలింగ్ చేసే సమయంలో కోహ్లీ కాస్తా నిర్లక్ష్యం వహించాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ తన నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాడని అన్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తోలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ల ముందు నిలదొక్కుకునే లోపే వికెట్ ను సమర్పించుకున్నాడు. ఆడమ్ జంపా బౌలింగులో సిక్స్ కొట్టి ఊపు మీద ఉన్నట్లు కనిపించిన కోహ్లీ ఆ తర్వాతి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. 

Also Read: ముంబై వన్డే: పరమ చెత్తగా కోహ్లీ సేన ఓటమి, ఓపెనర్లే ఫినిష్ చేశారు

జంపా ఊరిస్తూ వేసిన బంతిని ఆడాలా, వద్దా అనే సందేహంలో కోహ్లీ వికెట్ పారేసుకున్నాడు. దాంతో వన్డేల్లో, టీ20ల్లో కలిపి ఆరోసారి జంపా చేతిలో విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. ఇది రెండు ఫార్మాట్లలో ఒక బ్యాట్స్ మన్ అత్యధిక సార్లు జంపా అవుట్ చేసిన ఘనతగా నమోదైంది. జంపాకు ఆరుసార్లు కోహ్లీ అవుటైత్, రోహిత్ శర్మ, ధోనీ, కేదార్ జాదవ్, దాశున్ షనకాలు తలో మూడు సార్లు అతని బౌలింగులో పెవిలియన్ కు చేరుకున్నారు.

అస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ తమ ముందు ఉంచిన 256 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోకుండా ఛేదించారు. ఇద్దరు కూడా సెంచరీలు చేసి తడాఖా చూపారు.

Follow Us:
Download App:
  • android
  • ios