టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతి వేళ్లు విరిగిపోయాయంటూ మిడిలార్దర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ చేశాడు. మీరు ఏదో అనుకోకండి.. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా టాస్ వేసే సమయంలో కోహ్లీ ఒక రకమైన స్టెప్ వేశాడు.

Also Read:విరాట్ కోహ్లీ మరీ చెత్త: 19 ఇన్నింగ్సుల్లో జీరో సెంచరీలు

టీమిండియా బ్లేజర్ ధరించి రెండు చేతులను చాచి డాన్స్ చేశాడు. ఈ ఫోటోను బీసీసీఐ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అదే సమయంలో ఈ పిక్‌కు కామెంట్లు పెట్టాలని, బాగా వచ్చిన వాటిని అక్కడ పేర్కొంటామని అభిమానులకు తెలిపింది.

దీనికి స్పందించిన అయ్యర్ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. విరాట్ కోహ్లీ చేతి వేళ్లు విరిగిపోయాయంటూ పేర్కొన్నాడు. అతను అలా అనడానికి కారణం లేకపోలేదు. ఆ ఫోటోలో కోహ్లీ రెండు చేతలు చాచినట్లు కనిపిస్తుండగా.. వేళ్లు మాత్రం కిందకు వేలాడుతున్నాయి.

Also Read:నీకన్నా స్టీవ్ స్మిత్ బెట్టర్: విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

అందుకే శ్రేయస్ అయ్యర్ అలా స్పందించాడు. మరోవైపు ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మెన్‌గా ప్రఖ్యాతి గాంచిన విరాట్ కోహ్లీ ఇటీవల ఏమాత్రం రాణించడం లేదు. గత 19 ఇన్నింగ్స్‌లో విరాట్ మూడంకెల స్కోరును నమోదు చేయలేకపోయాడు.